Tuesday, March 25, 2025

యెమెన్‌లో విమానాశ్రయంపై యుఎస్ దాడి

- Advertisement -
- Advertisement -

హూతీ మీడియా ఆరోపణ
సనా : యెమెన్‌లో హొదైదాలోని విమానాశ్రయంపై యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) శనివారం దాడి చేసిందని హూతీ తీవ్రవాద మీడియా ఆరోపించింది. హూతీ తిరుగుబాటుదారులపై భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తామని ఒక వారం క్రితం వాషింగ్టన్ ప్రకటించిన దరిమిలా హూతీ తీవ్రవాదుల నుంచి ఆ ఆరోపణ వచ్చింది. ‘అమెరికన్ దాడి’ అని అల్‌మసీరాహ్ టివి నిందిస్తూ, ఎర్ర సముద్ర తీరంలోని హొదైదా విమానాశ్రయం లక్షంగా మూడు దాడులు జరిగాయని తెలియజేసింది. తీవ్రవాదులపై ‘నిరంతరం దాడులు సాగిస్తాం’ అని యుఎస్ సెంట్రల్ కమాండ్ బుధవారం నిర్ధారించిన, తీవ్రవాదులను ‘హతమారుస్తాం’ అని యుఎస్ అధ్మక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తరువాత బుధవారం, శుక్రవారం మధ్య ఇరాన్ మద్దతు ఉన్న తీవ్రవాదుల టివి చానెల్ అటువంటి ఆరోపణలను చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News