Friday, November 22, 2024

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కాబూల్: అఫ్గానిస్థాన్ లో రెండు దశాబ్దాల తరువాత అమెరికా ‘నిరంతర పోరు’ ముగింపు దశ లాంఛనంగా శనివారం ప్రారంభమైంది. అమెరికా, నాటో చివరి బలగాలు ఈ వేసవి అంతానికి అఫ్గాన్ నుంచి పూర్తిగా వైదొలగుతాయి. సెప్టెంబర్ 11 నాటికి బలగాలను పూర్తిగా ఉపసంహరించడమౌతుందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ మిగిలిన బలగాల ఉపసంహరణ మే 1 నుంచి అధికారికంగా ప్రారంభమౌతుందని గడువు విధించారు. ఆమేరకు 2500 నుంచి 3500 అమెరికా బలగాలు, దాదాపు 7000 వరకు నాటో బలగాలు వైదొలగుతాయి. శనివారానికి ముందుగానే బలగాలు తమ సామగ్రిని భారీ ఎత్తున పాకింగ్ చేయడం ప్రారంభమైంది. ఈలోగా ఏవేవి అమెరికాకు తిరిగి తీసుకెళ్లాలో, ఏవి అఫ్గానిస్థాన్ భద్రతా బలగాలకు అప్పగించాలో, ఏవి అఫ్గాన్ మార్కెట్లలో విక్రయించాలో మిలిటరీ నిర్ణయించింది. ఇటీవల కొన్ని వారాలుగా తమ సామగ్రిని భారీ సి 17 కార్గో విమానాల్లో అమెరికాకు పంపింది.

US begins withdrawal of forces from Afghanistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News