- Advertisement -
వాషింగ్టన్: అమెరికాలో కొవిడ్19 బూస్టర్ డోసుకు నిపుణుల కమిటీ సూచించింది. ఇటీవల అమెరికాలో మరోసారి కేసులు పెరగడంతో 65 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోస్‌ను కమిటీ సిఫారసు చేసింది. వైద్య సిబ్బందితోపాటు ఇతర ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్లు పైబడినవారికి కూడా బూస్టర్ డోస్‌ను సూచించింది. తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న 18 ఏళ్లు పైబడినవారికి కూడా బూస్టర్‌ను సూచించింది. రెండో డోస్‌తో బూస్టర్ డోస్‌కు కనీసం ఆరు నెలల వ్యవధి ఉండాలని తెలిపింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనల కోసం అమెరికాలోని వ్యాధుల నియంత్రణ కేంద్రం (సిడిసిపి) ఆధ్వర్యంలో వైద్య నిపుణులతో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -