Thursday, January 23, 2025

అమెరికన్ కాన్సులేట్‌లోకి నిషేధ వస్తువులు ఇవే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని అమెరికన్ కాన్సులేట్ ఇటీవల నానక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన తమ కొత్త కార్యాలయంలోకి తీసుకురాకూడని నిషిద్ధ వస్తువుల జాబితాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. దక్షిణాసియాలోనే అతి పెద్ద అమెరికన్ దౌత్య కార్యాలయంగా ఈ కొత్త కార్యాలయం ఏర్పడింది.

పాస్‌పోర్టు, వీసా కోసం వచ్చే దరఖాస్తుదారులు, సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు, అమెరికన్ పౌరులతోసహా సందర్శకులందరూ ప్రదేశం వద్దనే సెక్యూరిటీ స్క్రీనింగ్ పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును(ఒరిజినల్) సందర్శకులు తప్పనిసరిగా తీసుకురావాలి. ఫోటోకాపీలను అనుమతించరు. అంతేగాక గుర్తింపు కార్డులో ఉన్న పేరు అపాయింట్‌మెంట్‌లో ఉన్న పేరుతో పోలి ఉండాలి.

అమెరికన్ కాన్సులేట్‌లోకి తీసుకుపోవడానికి అనుమతిలేని వస్తువుల జాబితాను కాన్సులేట్ ప్రకటించింది.
1. సెల్‌ఫోన్లు.
2. బ్యాటరీతో నడిచే ఎలెక్ట్రానిక్ పరికరాలు
3. పర్సులు, ట్రావెల్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు, బ్రీఫ్‌కేసులు, సూట్‌కేసులు, సీలు చేయని ప్లాస్టిక్ బ్యాగులు, చిన్న గుడ్డ సంచులు, జిప్ ఫోల్డర్లు, ఇతర బ్యాగులు
4. ఆహారం లేదా పానీయ వస్తువులు
5. కాస్మెటిక్స్
6. సీల్డ్ ఎనవెలప్స్ లేదా ప్యాకేజ్‌లు
7. మండే వస్తువులు
8. పదునైన వస్తువులు
9. ఆయుధాలు
10. పొడవైన హ్యాండిల్ ఉండే గొడుగులు
11 . మతపరమైన పౌడర్లు(పసుపు, విబూది, కుంకుమ వంటివి)

ఈ జాబితా పరిమితం కాదు. సెక్యూరిటీ సిబ్బంది విచక్షణాధికారులతో ఇతర వస్తువులను కూడా అడ్డుకోవచ్చు.
కాన్సులేట్ వద్ద సందర్శకులు తమ వస్తువులన్నిటినీ ఒక ట్రేలో ఉంచాల్సి ఉంటుంది. ఆ ట్రే ఎక్స్‌రే మిషన్ ద్వారా స్కాన్ అవుతుంది. ఒకవేళ అందులో నిషధ వస్తువులు ఉన్న పక్షంలో వాటిని కాన్సులేట్ ప్రాంగణం వెలుపల వదిలి రావలసి ఉంటుంది.

హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ కొత్త కార్యాలయం 297 మిలియన్ డాలర్ల వ్యయంతో 12.2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడింది. ఇందులో 54 వీసా ప్రాసెసింగ్ విండోలు ఉన్నాయి. పైగా ప్యాలెస్‌తో లీజు గడువు 2023 మార్చి 15వ తేదీతో తీరిపోవడంతో కొత్త కార్యాలయం మార్చి 20న ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News