Saturday, December 28, 2024

చైనాపై ఆంక్షల కొరడా భారత్‌కు మరింత సాయం

- Advertisement -
- Advertisement -

US conveys full support to India

ఉక్రెయిన్ పరిణామాల దశలో అమెరికా వెల్లడి
పుతిన్‌కు మద్దతిస్తూ డ్రాగన్ దూకుడు
కట్టడికి దిగితే ఏం చేయలేరు

వాషింగ్టన్ : అమెరికా తాజాగా తన భారత్ మిత్రధర్మాన్ని చాటుకుంది. చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తోన్న రష్యాను చైనా ఎందుకు వెనకేసుకు వస్తోంది? ఎందుకు మద్దతు ఇస్తోంది? ఆంక్షల బాటలోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. అయితే రష్యా చమురును భారత్ ఇటీవలి కాలంలో తక్కువ ధరలకు పొందడాన్ని పరోక్షంగా సమర్థించింది. భారత్ రష్యా నుంచి ఆయుధ సాయం పొందుతోంది కాబట్టి అనివార్యంగా చమురు దిగుమతికి అంగీకరించి ఉంటుందని, ఈ క్రమంలో భారత్ రష్యాపై ఆధారపడకుండా అమెరికా సాయం చేస్తుందని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రస్తుత దశలో సాయం చేసినట్లు అయితే చైనాపై తమ దేశం నుంచి ఆంక్షలు కటుతరంగా ఉంటాయని, అప్పుడు ఆ దేశం ఆర్ధికంగా మార్కెట్‌పరంగా విలవిలలాడిపోతుందని ఈ దౌత్యవేత్త తెలిపారు.

రష్యా తప్పుడు సమాచారపు ప్రక్రియకు చైనా తోడుగా నిలుస్తోందని దీని వల్ల పరిస్థితిని మరింతగా విషమింపచేస్తోందని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి అయిన వెండీ శెర్మన్ తెలిపారు. గురువారం బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఏది ఏమైనా ఇప్పటి రష్యా యుద్ధంతో చైనాకు తగు గుణపాఠాలు అబ్బుతాయని విమర్శించారు. అమెరికాను మిత్ర పక్షాల నుంచి ఎవరూ దూరం చేయలేరనే విషయాన్ని అటు చైనా ఇటు రష్యా రెండూ తెలుసుకుంటాయని అన్నారు. రష్యా పట్ల ఎంతటి ఆంక్షలకు దిగామనేది ఇప్పటికే చైనా గ్రహించే ఉంటుంది, ఆ దేశానికి సాయం అందించే తంతు సాగితే ఇకపై చైనా కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. అప్పుడు ఈ రెండు దేశాలు తమ చేదు అనుభవాలను కలిసి పంచుకోవల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఇండియాకు పూర్తి సాయం
రష్యా సాయం అనవసరం

భారతదేశం ఇప్పటికీ ఇంతకు ముందటిలాగా రష్యా ఆయుధాలపై సాంప్రదాయకంగా ఆధారపడటం లేకుండా చేస్తామని సహాయ విదేశాంగ మంత్రిణి తెలిపారు. క్రమేపీ రష్యా విషవలయం నుంచి భారతదేశం వైదొలిగేలా చేసి తీరుతామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రష్యా ఆయుధ పరిశ్రమపై ఇప్పటి ఆంక్షల ప్రభావం తీవ్రతరం అవుతోందన్నారు. భారతదేశపు అశక్తతను తాము అర్థం చేసుకుంటామని ప్రత్యేకించి సైనిక పాటవానికి అవసరం అయిన ఆయుధాల గురించి రష్యాపై ఆధారపడాల్సి వస్తోందని, అయితే ఇక్కడో విషయం ఉంది. అమెరికా ఇటీవలి కాలంలో విధించిన ఆంక్షలతో రష్యా సైనిక పారిశ్రామిక కాంప్లెక్స్‌కు గండిపడిందని , ఇది ఇప్పట్లో కోలుకునే స్థితి లేదని, ఈ విషయాన్ని భారతదేశం గుర్తించాల్సి ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News