వాషింగ్టన్: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని సహచరులపై నమోదైన మోసం ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యూయార్క్‌లోని దివాలా కోర్టు కొట్టివేసింది. న్యూయార్క్ న్యాయస్థానం దక్షిణ జిల్లా న్యాయమూర్తి సీన్ హెచ్ లేన్ గత శుక్రవారం జారీ చేసిన ఈ ఉత్తర్వులు నీరవ్ మోడీకి గట్టి దెబ్బగా భావించవచ్చు. నీరవ్ మోడీ అతని సహచరులు మిహిర్ బన్సాలి, అజయ్ గాంధీలు దాఖలు చేసిన పిటిషన్లను న్యూయార్క్ కోర్టు కొట్టివేసింది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతరులను కోట్లాది డాలర్ల మేర మోసం చేయడం ద్వారా స్టాక్ ధరను తప్పుగా పెంచి లాభాలను తన సొంత కంపెనీలోకి మళ్లించాడని భారతీయ అమెరికన్ న్యాయవాది రవిబాత్రా చెప్పారు. 2011నుంచి 2018 వరకు నీరవ్ మోడీ, అతని సహచరులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌నుంచి రుణాలు తీసుకొని బ్యాంక్‌ను మోసం చేసినట్లు కోర్టు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నీరవ్ మోడీ మోసం చేయడం వల్ల బ్యాంక్‌కు బిలియన్ల డాలర్ల మేర నష్ట జరిగిందని నా ్యయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నీరవ్ మోడీ పిటిషన్‌ను కొట్టేసిన న్యూయార్క్ కోర్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -