Saturday, November 23, 2024

రుణ సంక్షోభంలో అగ్రరాజ్యం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్:  ప్రభుత్వ రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక ఒప్పందం ఒకటి, రెండ్రోజుల్లో కుది రే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం చెప్పారు. మరోవైపు అమెరికాలో తీవ్ర ఆర్థిక కల్లోలానికి దారి తీ యగల ఈ సంక్షోభ పరిష్కారానికి గడువును మరో నాలుగు రోజులు అంటే జూన్ 5 వర కు పొడిగించడంతో వైట్‌హౌస్‌కు, ప్రతిపక్ష రిపబ్లికన్ల మధ్య చర్చలు వచ్చే వారమంతా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అ మెరికా ఆర్థిక మంత్రి (ట్రెజరీ సెక్రటరీ) జా నెట్ యెల్లెన్ రాసిన లేఖలో నిర్ణయించిన ఈ కొత్త గడువు ఇంతకుముందు అంచనా వేసినదానికన్నా నాలుగు రోజులు ఎక్కువగా ఉండడం గమనార్హం. అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన గందరగోళంలోకి నెట్టి వేయకువడా ఉండఢంతో పాటు అగ్రరాజ్యం నాయకత్వం పట్ల ప్రపంచ దే శాల విశ్వాసం సన్నగిల్లకుండా చూసే విధంగాఎలా పరిష్కారం సాధించగలుగుతారా అని అమెరికన్లతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న స మయంలో ఈ గడువు పొ డిగింపు కాస్త ఊరటనిచ్చే అంశమనే చె ప్పాలి.

అయితే బైడెన్ మాత్రం ఈ చర్చలు ఫలప్రదం కాగలవన్న ధీమాతో ఉ న్నట్లు కనిపిస్తోంది. ఒప్పందం దా దాపు ఖరారు దశకు చేరుకుందని, ఈ విషయంలో తాను ఆశావహంగా ఉన్నట్లు క్యాంప్ డేవిడ్‌లో వారాంతపు సెలవులు గడపడం కోసం వెళ్తూ ఆయన చెప్పారు. కాగా చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఒప్పందం కుదురుతుందా లేదా అనే విషయం త్వరలో తెలుస్తుందని వైట్‌హౌస్ బృం దంతో చర్చలు జరుపుతున్న ప్రతిపక్ష రిపబ్లికన్లు అంటున్నారు. ‘కొత్త తేదీ నాటికి ఒప్పందం కుదరకపోతే అమెరికన్ కుటుంబాలకు తీవ్ర కష్టాలు ఎదురు కావడంతో పాటుగా మన ప్రపంచ నాయకత్వానికి హాని కలగడంతో పాటుగా మన జాతీ య ప్రయో.నాలను పరిరక్షించుకోవడంలో మన సామరం పట్ల అనుమానాలు తలెత్తుతాయి’ అని యెల్లెన్ తన లేఖలో తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

మరో వైపు వచ్చే వారం సోషల్ సెక్యూరిటీ చెల్లింపుల గడువు దగ్గరపడుతుండడంతో రిటైరయినవాళ్లు, ఇతరులుఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనన్న భయంతో ముందస్తు ప్రణాళికలు సి ద్ధం చేసుకుంటున్నారు. రెండేళ్ల పాటు బడ్జెట్ త గ్గింపునకు వీలుండే ఒక ఒప్పందం విషయంలో బైడెన్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీలు దాదాపుగా ఒక అంగీకారానికి వచ్చినట్లు కనిపిస్తోంది.అదే గనుక జరిగితే రుణ పరిమితి గడువు 2025లో జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాతదాకా కొనసాగే అవకాశం ఉంటుంది. అనేక దఫాలు ఏకాంతంగా చర్చలు జరిపిన తర్వాత రెండ్రోజుల్లో ఒక రాజీ ప్రతిపాదన కుదరవచ్చని అంటున్నారు.

కాగా ప్రభుత్వ వ్యయాల్లో భారీ కోతల కోసం పట్టుబడుతున్న రిపబ్లికన్లు ఈ విషయంలో కొంత పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. అయితే అధికార డెమోక్రాటిక్ ప్రతినిధులు మాత్రం దీన్నితీవ్రంగా వతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆహార సబ్సిడీలు పొందే వారిపై కఠినమైన షరతులు విధించాలన్న డిమాండ్ల విషయంలో ఇరుపక్షాలమధ్య తీవ్ర అభిప్రాయభేదాలు ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా రుణ సంక్షోభంపై చర్చలు జరుగుపుతున్న తన రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు, వైట్‌హౌస్ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయని శుక్రవారం ఉదయం చెప్పిన మెక్‌కార్తీ రాత్రి మాత్రం ఎలాంటి వాఖ్యా చేయకుండా వెళ్లిపోవడం గమనార్హం.

అయితే కుదిరే ఏ ఒప్పందమైనా అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందాలంటే అటు అధికార డెమోక్రాట్లతో పాటుగా ఇటు ప్రతిపక్ష రిపబ్లికన్లుకూడా రాజకీయంగా కొంత రాజీ పడాల్సి ఉంటుంది. పెరిగిపోయిన దేశ రుణాల చెల్లింపునకు ప్రస్తుతం 31 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న రుణపరపతిపై పరిమితిని ఎత్తివేయని పక్షంలో అమెరికాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర కుదుపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే అమెరికా కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం ఇవ్వవద్దంటూ మెక్‌కార్తీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఒప్పందం కుదరడానికి దాదాపుగా చేరువ అయ్యామన్న బైడెన్ ప్రకటనపై చర్చలు జరుపుతున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ తుది ఒప్పందానికి ఇంకా చాలా పతిబంధకాలున్నాయని అంటున్నారు.

అయితే 2024 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ వ్యయంలో కోత విధించడానికి, అలాగే 2025 సంవత్సరానికి ప్రభుత్వ వ్యయ వృద్ధిపై ఒక శాతం పరిమితి విధించడంపై ఇరు పక్షాల మధ్య దాదాపుగా అంగీకారం కుదిరినట్లు చెబుతున్నారు. అయితే శుక్రవారం రాత్రికల్లా దాదాపుగా ఒక ఒప్పందానికి వస్తామని ఇరు పక్షాలు చెబుతున్నప్పటికీ తుది ఒప్పందం కుదరడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టే అవకాశముందని అంటున్నారు. రుణ సంక్షోభంపై గత కొన్ని వారాలుగా అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగినా ఒక ఒప్పందం కుదరకపోవడంపై అమెరికన్లతో పాటుగా ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ‘గత ఏడాది చేసిన ఖర్చుకన్నా ఈ ఏడాది మనం తక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. చర్చలకు అదే స్టార్టింగ్ పాయింట్ కావాలి’ అని మెక్‌కార్తీ స్పష్టం చేస్తున్నారు.
రుణ పరిమితి సంక్షోభం అంటే ఏమిటి?
1917లో అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ రుణ పరిమితి లేదా సీలింగ్ అమెరికా ప్రభుత్వం గరిష్ఠంగా ఎంత మేరకు అప్పులు చేయవచ్చనేది నిర్ణయిస్తుంది. 2023 జనవరి నాటికి అమెరికా ప్రభుత్వం మొత్తం అప్పులు 31.4 ట్రిలియన్(లక్షల కోట్ల) డాలర్లుగా ఉంది. అమెరికా ప్రభుత్వం 2001నుంచి ప్రతి ఏటా సగటున దాదాపు లక్ష కోట్ల డాలర్ల లోటుతో నడుస్తోంది. అంటే ప్రభుత్వానికి అందే పన్నులు, ఇతర రాబడులకంటే ఎక్కువ సొమ్మును అది ఖర్చు చేస్తోంది. ఈ కారణంగా కాంగ్రెస్ ఆమోదించిన చెల్లింపులు జరపడానికి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుంది. రుణ పరిమితిని పెంచడానికి కాంగ్రెస్ ఆమోదం తెలపడం అంటే దేశం ఆర్థికంగా చేసే ఖర్చులు పెంచడం కాదు. దానికి వేరే బడ్జెట్ ఆమోదిత కేటాయింపులు ఉంటాయి.

అయితే రుణ పరిమితి పెంపునకు అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోని మెజారిటీ సభ్యుల ఆమోదం అవసరం. కానీ ప్రతినిధుల సభలో బైడెన్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేకపోవడంతో రిపబ్లికన్ల మద్దతుకూడా అవసరం అయింది. అందుకే విభేదాలు పక్కన పెట్టి ప్రతిపక్ష రిపబ్లికన్లతో చర్చలకు బైడెన్ సర్కార్ సిద్ధమయింది. రుణ పరిమితి పెంచితేనే ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయడానికి వీలుంటుంది. లేని పక్షంలో రక్షణ రంగంతో సహా వివిధ శాఖల కార్యకలాపాలకు నిధుల కొరత ఏర్పడడంతో పాటుగా ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య, ఆహార భద్రతా పథకాలకు చెల్లించాల్సిన నిధులకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా వ్యాపార సంస్థలు, కుటుంబాల రుణ వ్యయాలు పెరగడంతో పాటుగా వినియోగదారుడి విశ్వాసం సన్నగిల్లుతుంది.

ఫలితంగా అమెరికా ఆర్థిక మార్కెట్లు కుదుపునకు గురవడం దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడడం జరుగుతుంది. ఇతర కరెన్సీలతో అమెరికా డాలరు బలహీనపడుతుంది. అదే గనుక జరిగితే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఇప్పటివరకు చాలా సార్లు రుణ పరిమితిని పెంచాల్సిన పరిస్థితి రావడం, ప్రభుత్వాలు దాన్ని అధిగమించడం జరిగింది. ఇప్పుడు కూడా అంతా సవ్యంగానే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News