బీజింగ్: అట్లాంటిక్ తీరంలో శనివారం అమెరికాకు చెందిన పెంటగాన్ చైనా గూఢచర్య బెలూన్‌ను కూల్చేసింది. దీనిని అమెరికా పాలకవర్గం హర్సించింది. కానీ చైనా మాత్రం ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెల్లడించింది. ఎఫ్-22 విమానం నుంచి క్షిపణిని ప్రయోగించి అమెరికా ఆ గాలి గుమ్మటాన్ని కూల్చేసింది. తరువాత అది 47 అడుగుల జలాశయంలో పడిపోయింది. అమెరికా చర్యను ఆ దేశ రక్షణ మంతిర లాయిడ్ ఆస్టిన్ ‘చట్టపరమైన చర్య’ అన్నారు. కానీ చైనా మాత్రం ‘ఓ సివిలియన్ బెలూన్‌ను కూల్చేయడం అనేది అతిగా స్పందించడం, అంతర్జాతీయ నియమావళిని ఉల్లంఘించడమే’ అని విరుచుకుపడింది. ఓ ప్రత్యక్షసాక్షి సోషల్ మీడియాలో చైనా బెలూన్‌ను పేల్చేసిన వీడియోను షేర్ చేసుకున్నారు. అది నిలువుగా అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయింది.
అది చైనా ‘నిఘా బెలూన్’ అని, అమెరికా నింగిలో అనుమానస్పదంగా ఉందని అమెరికా అధికారులు గురువారం నుంచే చెప్పుకుంటూ వచ్చారు. అమెరికాచైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై చైనా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఆ బెలూన్ జనవరి 28న తొలిసారి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని పెంటగాన్ అధికారులు శనివారం విలేకరులకు తెలిపారు. అది కెనడా వైపు కదిలి, మళ్లీ అమెరికాలోకి ప్రవేశించిందని వారు తెలిపారు. భూతలంలో ఎవరికీ ఎలాంటి హానీ కలుగని రీతిలో అమెరికా పెంటగాన్ దానిని కూల్చేసింది. అదో నిఘా బెలూన్ అని అమెరికా రక్షణ అధికారులు, మిలిటరీ ధ్రువీకరించింది. కాగా బెలూన్ అవశేషాలను బృందాలు సేకరిస్తున్నాయని సీనియర్ మిలిటరీ అధికారి శనివారం తెలిపారు. ఆ బెలూన్ మిలిటరీ సైట్స్‌ను పర్యవేక్షించిందని ఓ రక్షణాధికారి తెలిపారు. అయితే ఇదిలావుండగా మరో చైనా గూఢచర్య బెలూన్ శుక్రవారం లాటిన్ అమెరికాలో కనిపించిందని, దాని వివరాలు తెలుపకుండానే పెంటగాన్ పేర్కొంది.