Saturday, November 23, 2024

20 ఏళ్ల మిలిటరీ ఆపరేషన్ ముగిసింది: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

- Advertisement -
- Advertisement -

US ends 20 year war in Afghanistan Says Joe Biden

వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్‌లో తమ దేశం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. అమెరికన్ల మరిన్ని ప్రాణాలు పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ సమర్థించుకున్నారు. మిలిటరీలోని అన్ని విభాగాల జాయింట్ చీఫ్స్ సిఫారసుమేరకే ఆగస్టు 31కి అక్కడి నుంచి తమ దళాలను పూర్తిగా వెనక్కి రప్పించామని ఆయన అన్నారు. అఫ్ఘన్‌లోని తాలిబన్లపై అమెరికా సాగించిన 20 ఏళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ తమ దేశ సైనిక బలగాల చిట్టచివరి విమానం సోమవారం అర్ధరాత్రి కాబూల్ నుంచి బయలుదేరిన కొన్ని గంటల తర్వాత బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా అక్కడ మిగిలి ఉన్న ఇతర దేశాలవారు, అఫ్ఘన్‌ను వీడాలనుకుంటున్నవారిని సురక్షితంగా తీసుకురావడానికి తమ అంతర్జాతీయ భాగస్వాములకు సహకరించాల్సిందిగా విదేశాంగమంత్రిని ఆదేశించానని ఆయన తెలిపారు. అఫ్ఘన్‌ను వీడాలనుకునేవారికి రక్షణ కల్పిస్తామని తాలిబన్లు తమకు హామీ ఇచ్చారని బైడెన్ తెలిపారు.

ఉపసంహరణతీరు అత్యంత అసమర్థం
ఏ చారిత్రక యుద్ధంలో ఇలా జరగలేదు:  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

బైడెన్ ప్రభుత్వం అఫ్ఘన్ నుంచి బలగాలను ఉపసంహరించినతీరు అత్యంత చెడ్డగా లేదా అసమర్థంగా ఉన్నదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇలాంటి ఉపసంహరణ చరిత్రలోని ఏ యుద్ధంలోనూ జరగలేదని ట్రంప్ అన్నారు. అఫ్ఘన్‌లోని మన పరికరాలన్నీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయాలి. వాటిని తిరిగి ఇవ్వకపోతే మరోసారి అక్కడికి మన సైన్యాన్ని పంపి తీసుకురండి. లేదంటే బాంబులేసి వాటిని నాశనం చేయాలి. యుద్ధంలో అమెరికా ఖర్చు చేసిన 8500 కోట్ల డాలర్లను తిరిగి తెచ్చుకోవాలి. ఇంతటి బలహీనమైన, మూర్ఖపు ఉపసంహరణను ఎవరూ ఊహించలేదని ట్రంప్ మండిపడ్డారు.

US ends 20 year war in Afghanistan Says Joe Biden

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News