న్యూయార్క్ : అమెరికా లోని న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ఇడా హరికేన్ విధ్వంసానికి భారత సంతతికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీ లోని ఎడిసన్‌లో 31 ఏళ్ల ధనుష్ రెడ్డి సౌత్ ప్లెయిన్‌ఫీల్డు లో స్టార్మ్ వాటర్ సూయర్ పైప్ లోంచి కొట్టుకుపోయినట్టు పోలీసులు చెప్పారు. కొన్ని మైళ్ల దూరంలో దట్టమైన అడవీ ప్రాంతంలో రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. రామ్‌స్క్రీట్స్ కుటుంబీకులు నలుగురు క్వీన్స్‌హోమ్‌లో వరద నీటిలో మునిగిపోయారు. ఇంటిలో ఉంటుండగానే ఆ కుటుంబ పెద్ద ధామేశ్వర్ రామ్‌స్క్రీట్స్ ను వరద ప్రళయం తుడిచిపెట్టుకు పోయింది. ఆయన తన భార్య తార చేయిని గట్టిగా పట్టుకున్నా లాభం లేక పోయింది. తార రామ్‌స్క్రీట్, ఆమె 22 ఏళ్ల కుమారుడు, నిక్ మునిగిపోయారు. మరో భారతీయ సంతతికి చెందిన 46 ఏళ్ల మాలతి కంచె సాఫ్ట్‌వేర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. తన 15 ఏళ్ల కుమార్తెతో కారు డ్రైవ్ చేస్తూ వస్తుండగా న్యూజెర్సీలో రూట్ 22 లో వంతన వరద నీటి దగ్గర కారు ఆగిపోయింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ వరదనీటి ఒత్తిడిని తట్టుకోలేక చెట్టును పట్టుకోగా, ఆ చెట్టు కూలిపోవడంతో వారిద్దరూ మునిగిపోయారు.