వాషింగ్టన్ : భారత్‌కు అమెరికా కేవలం 7.5 మిలియన్ కొవిడ్ టీకా డోసులు మాత్రమే అందించడంపై విచారం వెలిబుచ్చుతూ కొత్త వేరియంట్లతో ప్రపంచం ముప్పు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని డోసులు అందించ వలసిన అవసరం ఉందని జోబైడెన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా భారత్‌తో కలసి పోరాటం సాగించడానికి అమెరికా ఆకాంక్షిస్తోందని, వ్యాక్సిన్లతోసహా అన్ని రకాలుగా సహకరించాలనుకుంటోందని శ్వేతభవనం నుంచి ప్రకటన వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు ఈమేరకు ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలను కలవర పరుస్తున కొత్త వేరియంట్ల కట్టడికి వీలుగా ‘నొవిడ్’చట్టం అమలు లోకి వచ్చేలా అందరూ కలసి కట్టుగా ముందుకు రావాలని అధ్యక్షుడు జోబైడెన్‌ను, సహచర కాంగ్రెస్ సభ్యులను కోరుతున్నానని ఆయన చెప్పారు. భారత స్వాతంత్య్ర దినోత్సవానికి మనం చేరువవుతున్న సమయంలో బిలియన్ల కొద్దీ వ్యాక్సిన్లు సరఫరా అయ్యేలా ప్రపంచ దేశాలతో భాగస్వామ్యం పొందాలని, తద్వారా కొవిడ్ నుంచి మనం స్వాతంత్య్రం పొందామని ప్రకటించాలని ఆయన సూచించారు.
భారత్ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి వినతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -