Monday, December 23, 2024

యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా

- Advertisement -
- Advertisement -

మొబైల్ అగ్రగామి యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. కృత్రిమగా ధరలు పెంచుతోందని న్యూజెర్సి ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఈ దావా పిటిషన్ లో అమెరికాలోని 15 రాష్ట్ర ప్రభుత్వాలు సంతకం చేశాయి. ప్రభుత్వం.. సాంకేతిక అభివృద్ధిలో జోక్యం చేసుకుంటోందని యాపిల్ పేర్కొంది. గూగుల్, మెటా, అమెజాన్  కూడా ఇదే తరహా ఆరోపణలు ఏదుర్కోంటున్నాయి. అమెరికా ప్రభుత్వం పిటిషన్ వేసిన తర్వాత యాపిల్ షేర్లు 4.1 శాతం క్షీణించాయి. ఈ తగ్గుదలలో యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే 113 బిలియన్ డాలర్లు అంటే 9.4 వందల లక్షల కోట్లు తగ్గింది. అమెరికా చేస్తున్న ఆరోపణలను యాపిల్ సంస్థ ఖండించింది. ప్రభుత్వం ప్రమాదకర సంప్రదాయానని నెలకొల్పుతుందని ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News