Sunday, January 19, 2025

మరోసారి తెరపైకి గ్రహాంతర జీవుల వివాదం

- Advertisement -
- Advertisement -

లండన్: ఫుట్‌బాల్ మైదానం సైజులో ఉండే గుర్తు తెలియని ఎగిరే వస్తువు(యుఎఫ్‌ఓ)ను ప్రభుత్వం దాచిపెట్టిందని అమెరికా ఇంటెలిజన్స్ మాజీ అధికారి ఒకరు చెప్పారు. సిఐఎ, ఎఫ్‌బిఐ అధికారులు హాజరయిన ఓ రహస్య ప్రజెంటేషన్‌లో డేవిడ్ గ్రుష్ అనే ఈ అధికారి ఈ విషయం చెప్పినట్లు బ్రిటన్‌కు చెందిన న్యూస్ వెబ్‌సైట్ ‘మెట్రో’ వెల్లడించింది. అంతేకాదు 12 మీటర్ల పొడవుండే ఈ గ్రహాంతర వెహికిల్ ఒక ‘టార్డిక్’ ( పూర్వకాలం నాటి వస్తువు)అని దాదాపు 60 మంది హాజరయిన ఈకార్యక్రమంలో గ్రుష్ చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. న్యూయార్క్‌లోని పెంట్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని క్రిప్టో కరెన్సీ సలహాదారు జాన్ డి అగోస్టినో, న్యాయవాది జాన్ జె ఆల్టొరెల్లి ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది.

ఈ కార్యక్రమాన్ని ఫొటోలు తీయబాన్ని నిషేధించినప్పటికీ దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. అంతేకాదు ‘ఈ యుఎఫ్‌ఓ’అంతరిక్షాన్ని మార్పు చేయగలదని, అలాగే ఏడాదిలో 70 వేల ఇళ్లకు అవసరమైన విద్యుత్‌ను అందించగల శక్తి కలిగిందని ఆయన చెప్పారు. గతంలో కూడా గ్రుష్ గ్రహాంతర జీవులకు సంబంధించి అమెరికా కాంగ్రెస్‌తో విచారణ సహా అనేక చోట్ల ఇలాంటి వాదనలు చాలానే చేశారు కానీ తన వాదనలను సమర్థించే బలమైన సాక్షాధారాలను మాత్రం ఇవ్వలేదు. అయితే భూమిపైకి గ్రహాంతర వాసుల రాక గురించి వాదిస్తున్న వారిలో ఆయన ప్రముఖ వ్యక్తి అనేది మాత్రం కాదనలేని సత్యం. ఒక విచారణలో భాగంగా తాను గతంలో అమెరికా ప్రభుత్వం వద్ద గ్రహాంతర జీవులు ఉన్నాయనే దానికి సంబంధించి తాను అమెరికా కాంగ్రెస్‌కు, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజన్స్ కమ్యూనిటీకి ఇచ్చానని గ్రుష్ గత ఏడాది జూన్‌లో బహిరంగంగానే చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News