Thursday, December 26, 2024

వలసేతర వీసాల ఫీజులు అమెరికా భారీగా పెంపు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: హెచ్1 బీ, ఎల్1, ఇబి5 వంటి వివిధ కేటగిరీల వలసేతర వీసాల ఫీజులను అమెరికా ప్రభుత్వం భారీగా పెంచింది. ముఖ్యంగా చాలా మంది భారతీయులు ఈ వీసాలపైనే అమెరికాకు వెళ్తుంటారు. 2016 తరువాత ఇంత భారీగా పెరిగిన ఈ ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వస్తాయి. అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులకు ఉద్యోగం ఇచ్చేందుకు హెచ్1బీ వీసా వీలు కల్పిస్తుంది.

సాంకేతిక సంస్థలు ఈ వీసా ఆధారం గానే భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను ఏటా తాత్కాలికంగా తీసుకొంటుంటాయి. ఇబి5 వీసా పద్ధతి 1990లో అమెరికా ప్రారంభించింది. అమెరికాలో కనీసం 5,00,000 డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే విదేశీయులకు ఈ వీసా ఉద్దేశించబడింది. పెట్టుబడి దారులు తాము లేదా తమ కుటుంబాలు ఈ వీసా ద్వారా అమెరికాలో వ్యాపారాలు పెట్టడానికి వీలవుతుంది.

ఈ సంస్థల్లో అమెరికా ఉద్యోగులకు 10 ఉద్యోగాలు కల్పిస్తారు. ఇబి5 వీసా దరఖాస్తు ఫీజు 3675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వచ్చే హెచ్1 బీ వీసా దరఖాస్తు ఫీజు(ఫారం 1129) 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచడమైంది. హెచ్1 బి రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. అయితే ఇది వచ్చే సంవత్సరం నుంచి అమలు లోకి వస్తుంది. ఎల్1 వీసా వలసేతర వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1385 డాలర్లకు పెరిగింది. కంపెల మధ్య అంతర్గత బదిలీల కోసం ఈ వీసా ఉపయోగపడుతుంది.

బహుళ జాతి సంస్థలు తమ విదేశీ కార్యాలయాల నుంచి కొంతమంది ఉద్యోగులను అమెరికాలో తాత్కాలికంగా పనిచేయించడానికి బదిలీ చేయించడానికి ఈ వీసా వినియోగిస్తారు. ఫీజుల సర్దుబాటు, ఫారాల ఛార్జీలు, ఫీ విధానాలు నికర ఖర్చులకు, లాభాలకు, బదిలీ చెల్లింపులకు ఉపయోగపడతాయని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలియజేసింది. 2024 నుంచి 2033 వరకు ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు వార్షిక ఖర్చులు 157,005,952 డాలర్ల వరకు ఉంటుందని, ఇందులో 3 నుంచి 7 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News