Monday, December 23, 2024

ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసి

- Advertisement -
- Advertisement -

US House Speaker Pelosi visits Kyiv

అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మద్దతు పునరుద్ఘాటన

కీవ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఉక్రెయిన్‌లో పర్యటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన తర్వాత ఈ బృందం పోలండ్ అధికారులతో చర్చల కోసం అక్కడికి వెళ్తుంది. కాలిఫోర్నియానుంచి డెమోక్రటిక్ ప్రతినిధిగా రెండుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికైన పెలోసి రష్యాఉక్రెయిన్ యుద్ధం ప్రాంభమైన తర్వాత ఉక్రెయిన్ సందర్శించిన తొలి అమెరికా అత్యున్నత స్థాయి అధికారి కావడం గమనార్హం. ‘ అమెరికా ఉక్రెయిన్‌కు బలంగా అండగా ఉందని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మా ప్రతినిధి బృందం కీవ్‌కు వచ్చింది’ అని పెలోసి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెలోసి, ఇతర అమెరికా చట్టసభ ప్రతినిధులు కీవ్ చేరుకున్న ప్పటి చిత్రాలను అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం విడుదల చేసింది. పెలోసి, జెలెన్‌స్కీలు పరస్పరం కృతజ్ఞతలు తెలుపుకొంటున్న ఫోటోలను ఆ తర్వాత పెలోసి కార్యాలయం విడుదల చేసింది. ఈ ప్రతినిధి బృందంలో ప్రతినిధుల సభలో విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్న న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి గ్రెగోరీ మీక్స్, ఇంటెలిజన్స్ కమిటీ చైర్మన్, కాలిఫోర్నియా ప్రతినిధి ఆదమ్ స్కిఫ్, రూల్స్ కమిటీ చైర్మన్, మసాచుసెట్స్‌కు చెందిన జిమ్ మెక్‌గవర్న్, కొలరాడోకు చెందిన జేసన్ క్రో, కాలిఫోరియాకు చెందిన బర్బరా లీ ఉన్నారు. కాగా ఈ పర్యటన గురించి ముందుగా ప్రకటించకపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News