Friday, December 27, 2024

జమ్ము, కశ్మీర్‌లో పర్యటించవద్దు

- Advertisement -
- Advertisement -

US issues advisory for citizens travelling to India

తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ దాకా పర్యటించే వారుప్రత్యేక అనుమతులు తీసుకోండి

నేరాలు, ఉగ్రవాద ఘటనల దృష్టా భారత్ వెళ్లే వారికి అమెరికా విదేశాంగ సూచనలు

వాషింగ్టన్ : భారత్‌లో నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల దృష్టా ఆ దేశంలో పర్యటించేటప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలని అమెరికా తమ దేశ పౌరులను కోరింది. అంతేకాకుండా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ, కశ్మీర్‌లో పర్యటించవద్దని కూడా వారికి సలహా ఇచ్చింది. శుక్రవారం తాజాగా విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీలో అమెరికా విదేశాంగ శాఖ భారత ట్రావెల్ అడ్వైజరీ స్థాయిని 2నుంచి 4కు తగ్గించింది. ట్రావెల్ అడ్వైజరీ స్కేలుపై 4 అంటే అత్యధిక ప్రమాద స్థాయి అని అర్థం. కాగా అంతకు ముందు రోజు గురువారం విడుదల చేసిన మరో ట్రావెల్ అడ్వైజరీలో అమెరికా విదేశాంగ శాఖ పాకిస్థాన్‌ను మూడో స్థానంలో ఉంచుతూ, ఆ దేశంలో ముఖ్యంగా ఉగ్రవాదం, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రాల్లో పర్యటించవద్దని తమ పౌరులకు సలహా ఇచ్చింది.‘ నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల దృష్టా భారత్‌లో పర్యటించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అని విదేశాంగ శాఖ ఆ అడ్వైజరీలో సూచించింది. ఉగ్రవాదం, పౌర అశాంతి కారణంగా తూర్పు లడఖ్ ప్రాంతం, దాని రాజధాని లేహ్ మినహా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ, కశ్మీర్‌లో పర్యటించవద్దు.

అలాగే సాయుధ ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉన్న దృష్టా భారత్‌పాక్ సరిహద్దులకు 10 కిలోమీటర్ల లోపు పర్యటించవద్దు’ అని ఆ అడ్వైజరీ పేర్కొంది. దేశంలో శరవేగంగా పెరుగుతున్న నేరాల్లో రేప్ ఒకటని, పర్యాటక ప్రదేశాలు, ఇతర ప్రాంతాల్లో లైంగిక దాడులు వంటి హింసాత్మక నేరాలు జరుగుతున్నాయని భారత్‌నుంచి అందుతున్న వార్తలు పేర్కొంటున్నాయి అలాగే పర్యాటక ప్రాంతాలు, బస్టాండులు లాంటి రవాణా కేంద్రాలు, మార్కెట్లు లేదా షాపింగ్ మాల్స్. ప్రభుత్వ భవనాలు వంటి వాటిపై ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే దాడి చేసే అవకాశం ఉందని కూడా తెలిపింది. అలాగే తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణనుంచి పశ్చిమ బెంగాల్ దాకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించే అమెరికా పౌరులకు ప్రభుత్వం అత్యవసర సర్వీసులు అందించే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ, ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి అమెరికా అధికారులు స్థానిక అధికారులనుంచి ప్రత్యేక అనుమతి పొందాలని కూడా ఆ అడ్వైజరీలో అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News