తైవాన్‌లో పర్యటనకు కాంగ్రెస్ సభ్యులను అమెరికా పంపింది. ఆ బృందం ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటించనుంది. తైవాన్ విషయంలో చైనాను హెచ్చరించేలా చర్యలను అమెరికా చేపట్టింది. కొత్త అధ్యక్షుడు లాయ్‌చింగ్‌తో అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు కూడా జరపనుంది. వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, పెట్టుబడులు, పరస్పర ప్రయోజనాలు వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది. ఈ బృందంలో ది హౌస్ పారన్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు మిషెల్ మెక్‌కౌల్ కూడా సభ్యుడు కావడం విశేషం.
ఆయన వెంట రిపబ్లికన్, డెమోక్రాట్ సభ్యులు తైవాన్‌కు చేరుకున్నారు. చైనా విషయంలో ఆయన చాలా కఠినంగా మాట్లాడతారన్న పేరుంది. గత ఏడాది ఆయన తైవాన్ సందర్శించిన వేళ చైనా అధినేత జిన్‌పింగ్‌ను హిట్లర్‌తో పోల్చడం సంచలనం సృష్టించింది. తాజాగా మెక్‌కౌల్ మాట్లాడుతూ “ తమ పర్యటనతో తైవాన్ ప్రజలకు అండగా, అమెరికా ఉందన్న సంకేతాలు చైనా కమ్యూనిస్టు పార్టీకి వెళతాయి. తైవాన్ జలసంధిలో యథాతధ స్థితి కొనసాగేలా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ” అని పేర్కొన్నారు.