న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ విమానం రన్ వే పైనుంచి అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హవాయిలోని మెరైన్ కోర్‌బేస్‌లో అమెరికా నౌకదళంలోని పి8ఎ పొసెడాన్ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. కోస్టు గార్డు వెంటనే స్పందించి విమానంలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీశారు. సముద్రంలో బోటింగ్ చేస్తున్నవారు విమానం నీటిపై తేలడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజిబిలిటీ తక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని విమానయాన అధికారులు వెల్లడించారు. పి8ఎ విమానం సబ్‌మెరైన్లు గాలించి దాడి చేసే సామర్థ్యం ఉంది. టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను తీసుకెళ్లడంతో పాటు ఇంటెలిజెన్స్‌కు కూడా సేకరించగలదు. పి8ఎ పొసెడాన్ విమానాలు భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నార్వే, బ్రిటన్ సైన్యాల వద్ద ఉన్నాయి. 2009లో అమెరికాలో ఒక విమానంలో హడ్సన్ నది మధ్యలో దిగింది. ఫైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
🇺🇸 US Navy plane overshoots runway and ends up in a bay in Hawaii
The P-8A "Poseidon" overshot the runway at a Marine base on Kaneohe Bay, said U.S. Marine Corps Spox Gunnery Sgt. Orlando Perez said that all nine people on board the aircraft made it safely to shore@DlugajJuly pic.twitter.com/ltXxVgpvCU
— Velerie (@velerie_a) November 21, 2023