Saturday, November 23, 2024

దెబ్బతిన్న అమెరికా అణు జలాంతర్గామి

- Advertisement -
- Advertisement -
USS submarine
దక్షిణ చైనా సముద్రంలో పనిచేస్తున్న జలాంతర్గామి…

వాషింగ్టన్: ఆసియా సముద్ర జలాల్లో పనిచేస్తున్న అమెరికా అణు జలాంతర్గామి తెలియని వస్తువు తగలడంతో దెబ్బతిందని అమెరికా నౌకాదళం గురువారం వెల్లడించింది.‘యూఎస్‌ఎస్ కనెక్టికట్’ అనే అణు జలాంతర్గామి అక్టోబర్ 2న నీళ్ల లోతులోకి వెళుతున్నప్పుడు ఏదో వస్తువు దానిని తాకింది. ఆ జలాంతర్గామి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పనిచేస్తోందని అమెరికా నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాంతక గాయాలేవి కాలేదని యూఎస్‌ఎన్‌ఐ న్యూస్ అనే వార్తా సంస్థ తెలిపింది. ఈ జలాంతర్గామి దక్షిణ చైనా సముద్రంలో కూడా పనిచేస్తోందని ఆ వార్తాసంస్థ పేర్కొంది. కొన్ని చిన్న దీవులు, దిబ్బలు,ఇతర భూభాగాలు తనవని చైనా వాదిస్తున్నందున చైనాకు చెందిన వివాదాస్పద ప్రాంతంలో ఈ అణు జలాంతర్గామి పనిచేస్తోందని సమాచారం. ఇదిలావుండగా దెబ్బతిన్న జలాంతర్గామికి ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది పరిశీలిస్తున్నామని, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అమెరికా నౌకాదళం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News