Wednesday, January 22, 2025

చెమటోడ్చిన రదుకాను, సబలెంకా

- Advertisement -
- Advertisement -

US Open champion: Raducanu beats Sloane Stephens

మెద్వెదేవ్, సిట్సిపాస్ ముందుకు
ఆస్ట్రేలియా ఓపెన్

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఎమ్మా రదుకాను, అరినా సబలెంకా తొలి రౌండ్‌లో చెమటోడ్చి విజయం సాధించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), నాలుగో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్) రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఇతర పోటీల్లో నిక్ కిర్గియాస్ (ఆస్ట్రేలియా), ఫ్రాన్సెస్ టియోఫె (అమెరికా) తదితరులు జయకేతనం ఎగుర వేశారు. మరోవైపు 11వ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), ఆండీ ముర్రే (బ్రిటన్), 13వ సీడ్ డీగో షావర్ట్‌మాన్ (అర్జెంటీనా) కూడా మొదటి రౌండ్‌లో విజయం సాధించి ముందంజ వేశారు.

గట్టెక్కింది..

ఇక మహిళల సింగిల్స్‌లో 17వ సీడ్, యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రదుకాను తొలి రౌండ్‌లో చెమటోడ్చి నెగ్గింది. అమెరికా క్రీడాకారిణి స్లొవానె స్టీఫెన్స్‌తో జరిగిన మూడు సెట్ల పోరులో రదుకాను విజయాన్ని అందుకుంది. తొల సెట్‌లో రదుకాను పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. ఈ క్రమంలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే సెట్‌ను దక్కించుకుంది. కానీ రెండో సెట్‌లో ప్రత్యర్థి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం ఎమ్మా పైచేయి సాధించింది. స్టీఫెన్స్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది. ఇక 16వ సీడ్ ఎంజిలిక్ కెర్బర్‌కు తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది.

ఇస్టోనియా క్రీడాకారిణి కయా కనెపి 64, 63తో కెర్బర్‌ను కంగుతినిపించింది. మరో పోటీలో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) తొలి రౌండ్‌లో చెమటోడ్చి విజయం సాధించింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి స్టోర్మ్ సండర్స్‌తో జరిగిన పోరులో సబలెంకా 57, 63, 62తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో సబలెంకాకు చుక్కెదురైంది. అయితే తర్వాత వరుసగా రెండు సెట్లను గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ గార్బయిన్ ముగురుజా (స్పెయిన్) జయకేతనం ఎగుర వేసింది. క్లారా బురెల్ (ఫ్రాన్స్)తో జరిగిన పోరులో ముగురుజా 63, 64తో విజయం సాధించింది. ఇతర పోటీల్లో ఏడో సీడ్ స్వియాటెక్ (పోలండ్), ఆరో సీడ్ అన్నెట్ కొంటావెట్ (ఇస్టోనియా), 19వ సీడ్ ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం), 14వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), పదో సీడ్ అనస్టాసియా పావ్లిచెంకొవా తదితరులు విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

ముర్రే ముందంజ..

పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. జార్జియాకు చెందిన 22వ సీడ్ నికోల్జ్‌తో జరిగిన ఐదు సెట్ల హోరాహోరీ పోరులో ముర్రే జయకేతనం ఎగుర వేశాడు. నువ్వానేనా అన్నట్టు సాగినపోరులో ముర్రే 61, 36, 64, 67, 64తో జయభేరి మోగించాడు. మరో పోటీలో రెండో సీడ్ మెద్వెదేవ్ 61, 64, 76తో హెన్రి లాక్సొనెస్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. సిట్సిపాస్ కూడా తొలి రౌండ్‌లో విజయం అందుకున్నాడు. స్వీడన్ ఆటగాడు మిఖాయిల్ ఐమర్‌తో జరిగిన పోరులో సిట్సిపాస్ 62, 64, 63తో జయకేతనం ఎగుర వేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News