Thursday, January 23, 2025

జకోవిచ్ సాధన షురూ..

- Advertisement -
- Advertisement -

లండన్ : త్వరలో ప్రారంభమయ్యే అమెరికా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ కోసం సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సాధన ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వింబుల్డన్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న జకోవిచ్ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తున్నాడు.

అయితే అమెరికా ఓపెన్ సమీపిస్తుండడంతో జకోవిచ్ మళ్లీ రాకెట్‌ను పట్టాడు. సాధనతో పాటు జిమ్‌లోనూ చెమటోడ్చుతున్నాడు. స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్‌తో జరిగిన వింబుల్డన్ ఓపెన్ మారథాన్ ఫైనల్లో జకోవిచ్ అనూహ్య ఓటమి చవిచూశాడు. యూఎస్ ఓపెన్‌లోనూ అతనికి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జకోవిచ్ ఆటతో పాటు ఫిట్‌నెస్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News