వాషింగ్టన్: గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి డాక్టర్ జిల్ బైడెన్ అత్యంత వైభవంగా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. జార్జి బుష్ పాలనా కాలం నుంచి దీపావళి వేడుకల సందర్భంగా అధ్యక్ష దంపతులు అమెరికాలోని భారతీయ ప్రముఖులకు విందు ఇవ్వడం ఆనవాయితీ వస్తోంది. వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో సోమవారం అధ్యక్ష దంపతులు ఆతిథ్యమిచ్చిన విందు సమావేశానికి 200 మందికి పైగా భారతీయ ప్రముఖులు హాజరయ్యారు. గతంలో ఈ దీపావళి విందు భారత్-అమెరికా సంబంధాలకు చెందిన కొన్ని చారిత్రక సంఘటనలకు వేదికగా నిలిచింది. 2008 నవంబర్‌లో అప్పటి భారత ప్రధాని మన్మోమన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అణు ఒప్పందంపై సంతకం చేసి సంయుక్త విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కాగా..బైడెన్ దంపతులు ఇచ్చిన దీపావళి విందు సందర్భంగా ప్రముఖ సితార్ విద్యాంసుడు రిషబ్ శర్మ సంగీత కచేరి, సా డ్యాన్స్ బృందం వారి నృత్య ప్రదర్శనలు జరిగాయి. చీర, లెహంగా, షేర్వానీ వంటి భారతీయ వస్త్రధారణలో అతిథులు హాజరుకాగా ఘుమఘుమలాడే భారతీయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వైభవంగా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -