Saturday, September 28, 2024

మోడీకి అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ అగ్రనేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొట్టమొదట ప్రధాని మోడీని అభినందించారు. మూడో సారి ప్రధానిగా విజయం సాధించడంపై మోడీకి, బీజేపీకి ఆయన అభినందనలు తెలిపారు. ఉభయ దేశాల మధ్య సంబంధాల్లో కొత్త ప్రభుత్వం నుంచి మరింత ఊపు అందుకోగలదని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అమెరికా తరఫున బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్ హాజరు కానున్నారు. ఏప్రిల్ లోనే భారత్‌లో పర్యటించాలనుకున్న సుల్లివాన్ ఇరాన్‌ఇజ్రాయెల్ సంక్షోభం, పన్నూన్ సంఘటన కారణంగా పర్యటన వాయిదా పడింది. ఈమేరకు శ్వేతభవనం మోడీ విజయం చారిత్రాత్మకంగా అభివర్ణిస్తూ ఫోన్ ద్వారా ప్రకటించింది.

కెనడా ప్రధాని ట్రూడో అభినందనలు

ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ విజయం సాధించడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభినందనలు తెలియజేశారు. “ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోడీకి అభినందనలు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్లేలా మోడీ ప్రభుత్వంతో కలిసి కెనడా ప్రభుత్వం పనిచేస్తుంది. మానవ హక్కులను , వైవిధ్యాన్ని, చట్టాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్తాం ” అని ట్రూడో తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. హర్‌దీప్‌సింగ్‌నిజ్జర్ హత్యతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, ట్రూడో మోడీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News