Monday, December 23, 2024

సైకిల్‌పై నుంచి జారి పడిన బైడెన్

- Advertisement -
- Advertisement -

US President Joe Biden falls off bicycle

 

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిలుపై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్టు తెలిపారు. బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగల లేదని, వైట్‌హౌస్ పేర్కొంది. బైడెన్ డెలావేర్ రాష్ట్రం లోని బీచ్‌హోమ్ వద్ద కుటుంబంతో గడుపుతున్నారు. శనివారం ఉదయం భార్య, ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి రెహోబోత్ బీచ్ లోని స్టేట్ పార్కులో సైకిల్ తొక్కారు. అక్కడ గుమిగూడిన స్థానికులు, మీడియా వారితో మాట్లాడడానికి బైడెన్ సైకిలు ఆపగా పట్టుతప్పి కింద పడిపోయారు. సైకిల్‌పై నుంచి కాలును ఒక్కసారి తీయడంతో బ్యాలెన్స్ కోల్పోయినట్టు బైడెన్ చెప్పారు. ఎలాంటి గాయాలు కాలేదని, వైద్యం అవసరం లేదని వైట్‌హౌస్ పేర్కొంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రేకింగ్ న్యూస్ .. బైడెన్‌సైకిల్‌ను పుతిన్ అడ్డుకుని పడిపోయేలా చేశారు అంటూ నెటిజన్లు ఒకరు చమత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News