Friday, December 20, 2024

అమెరికా అధ్యక్షుడికి మళ్లీ కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

US President tests positive for Covid-19

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మళ్లీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి కోలుకున్న మూడ్రోజుల్లోనే బిడెన్ జూలై 30న మళ్లీ కోవిడ్-19 పరీక్షించబడ్డారని వైట్ హౌస్ అధికారిక ప్రకటన తెలిపింది. కోవిడ్ పాజిటివ్ రావడంతో బైడెన్ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. బైడెన్‌కు కరోనా సోకినప్పటికీ ఎమర్జెన్సీ లక్షణాలేమీ లేవని వైట్ హౌస్ ఫిజీషియన్ డా.కెవిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడిన గంటలకు బైడెన్ తన ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. బైడెన్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News