Sunday, December 22, 2024

పార్టీలో ట్రంప్ కు గట్టి పోటీ..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. దేశ మాజీ ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ తాను వచ్చేసారి ఎన్నికలలో పార్టీ తరఫున బరిలో ఉంటానని తెలిపి, మద్దతుకోసం ప్రచారం పెంచారు. ఇంతకు ముందటి తన బాస్‌కు సవాలు విసిరారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున వైట్‌హౌస్ పీఠం కోసం ఆయన అమెరికా ఎన్నికల సంఘం వద్ద తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇప్పటికే తాను పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా ఉంటున్నట్లు ట్రంప్ పలుసార్లు ప్రకటించి ఉన్నారు. 63 సంవత్సరాల పెన్స్ బుధవారం నుంచి అధికారిక ప్రచారం చేపడుతారని, లోవాలో సంబంధిత పోటీకి ముందుగా పార్టీలో ఓటింగ్ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News