Thursday, January 23, 2025

భారత్ ఏ పక్షమో తేల్చుకోవల్సి: అమెరికా చురకలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో యుద్దం సమయంలో భారతదేశం రష్యా నుంచి చౌకధర చమురు ఒప్పందానికి దిగడంపై అమెరికా స్పందించింది. భారతదేశం ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగించుకోవడం రష్యాపై అమెరికా ఆంక్షల ఉల్లంఘనల పరిధిలోకి రాదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అయితే భారతదేశం కానీ ఇతర దేశాలు కానీ ప్రస్తుత దశలో ఇటువంటీ డీల్స్‌కు వెళ్లడం ఎంతవరకు సముచితమో ఆలోచించుకోవల్సి ఉందని అమెరికా తెలిపింది. ఈ విధంగా భారతదేశానికి పరోక్ష హెచ్చరికలు వెలువరించింది. రష్యా భారత్‌కు అత్యధిక కోటా లో ముడిచమురును తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ముందుకు వచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతులను అమెరికా నిలిపివేసింది. ఆర్థిక ఆంక్షలను కట్టుది ట్టం చేసింది. ఈ దశలోనే భారత చర్య తమ పట్ల ఉల్లంఘనగా తాము పరిగణించడంలేదని పేర్కొన్న అమెరికా, ఈ దశలో భారతదేశం తన వైఖరి ఏమిటనేది సుస్పష్టం చేసుకోవాలని సూచించింది. ఎవరు ఎవరెవ్వరి పక్షం అనేది ఇటువంటి దశల్లోనే ఖరారు అవుతుంది. చేపట్టే చర్యలే అన్నింటిని ఖరారు చేస్తాయని వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకి బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నాటి నుంచి అమెరికా ఇతర దేశాలు తీవ్రస్థాయి చర్యలకు దిగుతున్నాయి.

ఈ దశలో అంతర్జాతీయంగా అటు ఉక్రెయిన్ అనుకూల దేశాలు, ఇటు రష్యా మద్దతు దేశా ల సమీకరణం కీలకం అవుతోంది. రష్యా నుంచి భారతదేశం చమురును సేకరించుకుంటున్న దశలో వైట్ హౌస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు వెలువరించారు. ‘అమెరికా వెలువరించిన ఆంక్షలకు కట్టుబడాలని అన్ని దేశాలను కోరాం. స్పష్టమైన సందేశం వెలువరించాం’ అని తెలిపారు. భారత్ చర్య తమ మాటను కాదన్నట్లుగా తాము భావించడం లేదని, చమురు విషయాలలో ఆ దేశానికి ఉన్న అశక్తత, దిగుమతుల అసరాలకు ఆధారపడాల్సి రావడం వంటి పలు కోణాలు ఉంటాయని భావించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే క్లిష్టతల నడుమనే చరిత్ర పుస్తకాలు కొత్త అధ్యాయాలను సంతరించుకుంటాయి. వైరిపక్షం స్వపక్షం గురించి ఖరారు చేసుకునే ఘట్టం ఇదేఅవుతుందని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు భారతదేశం మద్దతు ప్రకటించలేదు. ఇరు పక్షా లూ సయోధ్యను పాటించడం మంచిదని తరచూ భారత్ చెపుతూ వస్తోంది. భాగస్వామ్యపక్షాలున్ని కూడా సం యమనం కీలకంగా సాగాల్సి ఉందని చెపుతోంది. ఐరాసలో ఇటీవల రష్యాకు వ్యతిరేక తీర్మానం తీసుకువచ్చినప్పుడు జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు అయింది. రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతిని అమెరికా సానూభూతితోనే అర్థం చేసుకొంటోందని బైడెన్ అధికార యంత్రాంగం భావిస్తోంది.
రష్యాకు ఇండియా సైడ్ కొట్టినట్లే
ప్రస్తుత తరుణంలో భారతదేశం రష్యా నుంచి చమురు కలిసివచ్చిన అవకాశంగా తక్కువ ధరకు తీసుకోవడం అనుచితం అవుతుందని అమెరికా చట్టసభ సభ్యులైన ఇండో ఇమెరికన్ డాక్టర్ అమి బెరా వ్యాఖ్యానించారు. కొనుగోళ్ల వ్యవహారం జరుగుతున్నట్లు వచ్చిన వార్త నిజమైతే ఇక ఇప్పుడు భారత్ నిజంగానే రష్యా పక్షం వహించినట్లు అవుతుంది, పుతిన్‌తో భారత్ చేతులు కలిపినట్లు ఖరారు అయినట్లే అని వ్యాఖ్యానించారు. రష్యా చర్యకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఐక్యం అవుతున్న కీలక దశలో ఇండియా ఈ విధంగా వ్యవహరించడం సరైన చర్య అవుతుందా? అని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఈ ప్రతినిధి ప్రశ్నించారు.

US Reacts on India-Russia Oil Deal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News