ఉన్నత చదువులకు అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ వార్త. అమెరికాలో విద్యాభ్యాసానికి వచ్చే విద్యార్థులకు ఇచ్చే ఎఫ్ -1 వీసాలు గత పదేళ్లలోనూ ఎన్నడూ లేనంతగా తిరస్కరణకు గురయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో
(అమెరికా ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ) అమెరికాకు 6.79 లక్షల ఎఫ్ వన్ వీసాలకు దరఖాస్తులు వస్తే. వాటిలో 41 శాతం అంటే, 2.79 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అంతకు ముందు సంవత్సరం అంటే 2033 -23 లో మొత్తం 6.99 లక్షల దరఖాస్తులు వస్తే, 36 శాతం అంటే 2.53 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి.
ఏఏ దేశానికి చెందిన ఎన్ని ఎఫ్ 1 వీసాలు తిరస్కరణకు గురయ్యాయో అమెరికా విదేశాంగ శాఖ డేటా ప్రకటించనప్పటికీ, 2024 సంవత్సరం మొదటి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్ 1 వీసాల సంఖ్య 2023లో మొదటి 9 నెలల కాలంతో పోలిస్తే 38శాతం తగ్గాయి.గత పదేళ్లుగా అమెరికాకు అన్నివిదేశాలనుంచి వచ్చే విద్యార్థుల పీసా దరఖాస్తులలో దాదాపు సగం తిరస్కరణకు గురయ్యాయి. 201415 సంవత్సరంలో 8.56 లక్షల స్టూడెంట్ వీసా దరఖాస్తులు వస్తే.. 2019-20 కోవిడ్ సంవత్సరంలో అత్యంత తక్కువగా కేవలం 1.62 లక్షల దరఖాస్తులే వచ్చాయి.