Friday, December 20, 2024

నక్సల్స్ నుంచి అమెరికా ఆయుధం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల సమయంలో దొరికిన కొన్ని ఆయుధాల్లో అమెరికాలో తయారైనవి ఉన్నాయని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆదివారం తెలిపారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 40 నిమిషాల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు డివిజినల్ కమిటీ సభ్యుడు మోహన్ కడ్తి(40), మట్వారా ఎల్‌ఒఎస్ సభ్యుడు రమేశ్(32), మహిళా మావోయిస్టు నేత సుమిత్ర(28), మరో మహిళా మావోయిస్టు మృతి చెందారు.

ఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహాలతో పాటు నాలుగు ఆయుధాలు, పేలుడు సామాగ్రి, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ అమెరికా ఎం1 కార్బైన్ తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ తుపాకీ అమెరికా సైన్యానిదై ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News