- Advertisement -
వాషింగ్టన్: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరిగిన చైనా కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా, బ్రిటన్,అమెరికా త్రైపాక్షిక భద్రత కూటమిలో భారత్, జపాన్‌ను చేర్చేది లేదని అమెరికా ప్రకటించింది. ఇదే సందేశాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యూల్ మెక్రోన్‌కు కూడా పంపినట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి బుధవారం రోజువారి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ వారం క్వాడ్ సమావేశంలో పాల్గొనబోతున్న భారత్, జపాన్‌లను కూడా నూతన భద్రత కూటమిలో చేరుస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు ఆమె సామాధానం ఇస్తూ ఈ స్పష్టీకరణ చేశారు.
- Advertisement -