Friday, November 22, 2024

ముంబయి పెట్రోకంపెనీపై అమెరికా ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

US sanctions on Mumbai Petrocompany

న్యూఢిల్లీ: ముంబయి కేంద్రంగా ఉన్న ప్రైవేట్ పెట్రోకెమికల్ కంపెనీపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. దీనిపై భారత్ విదేశాంగశాఖ శనివారం సందించింది. ఇరానియన్ పెట్రోలియం ఉత్పత్తులను అమ్ముతున్నారనే ఆరోపణలతో అమెరికా ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ పెట్రోకంపెనీ ఆంక్షలు విధించిన దేశాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులు కూడా భారత్‌కు చెందిన ప్రైవేటు కంపెనీ విక్రయిస్తోందని అమెరికా ఆరోపించింది. ప్రైవేట్ కంపెనీపై ఆంక్షలును విధించడం అనేది కొత్త పరిణామం దీనిని పరిశీలిస్తున్నామని దేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి బాగ్చి సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భారత విదేశాంగ మంత్రి వాషింగ్టన్‌లో పర్యటించినపుడు అధికారులతో సంప్రతింపులు జరిపారు. అయితే ప్రైవేట్ కంపెనీపై ఆంక్షల విధించడాన్ని వారు బాగ్చీతెలిపారు. పాకిస్థాన్‌కు ఎఫ్ 16 యుద్ధవిమానాలను అమెరికా అందజేయడంపై బాగ్చీ మాట్లాడుతూ విషయంలో అమెరికాకు భారత్ అభిప్రాయాలు, ఆందోళనలపై అవగాహన ఉందన్నారు. కాగా పాకిస్థాన్‌కు 450అమెరికన్ డాలర్ల విలువైన 16 యుద్ధ విమానాల సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను అందజేయాలని భావిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News