Sunday, September 8, 2024

అమెరికా ఆయుధాల వినియోగంలో ఇజ్రాయెల్ చట్ట ఉల్లంఘన?

- Advertisement -
- Advertisement -

అమెరికా అందించిన ఆయుధాలను గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ వినియోగించి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని బైడెన్ ప్రభుత్వం శుక్రవారం అనుమానం వ్యక్తం చేసింది. కానీ యుద్ద కాల పరిస్థితుల వల్ల నిర్దిష్ట వైమానిక దాడుల్లో ఈ విషయాన్ని అమెరికా అధికారులు నిర్దారించడానికి తగిన సాక్షాలు సేకరించడం వీలు పడడం లేదని అమెరికా యంత్రాంగం నివేదిక శుక్రవారం పేర్కొంది.

ఈ మేరకు హెచ్చరికలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. గాజాపై దాడులు జరిగి 35000 వేల మంది పాలస్తీనియన్ల ప్రాణాలు కోల్పోయిన ఏడు మాసాల తరువాత ఈ విధమైన సమీక్ష నివేదిక వెలువడడం గమనార్హం. జోబైడెన్ కు చెందిన డెమోక్రాట్ల ఒత్తిడి వల్లనే మొదటి సారి ఇలాంటి నివేదిక వెలువడిందని భావిస్తున్నారు.. ఇజ్రాయెల్ ఎంతవరకు చట్టాన్ని ఉల్లంఘించిందో తేల్చకుండా ఇజ్రాయెల్‌ను గట్టిగా తప్పుపట్టడానికి ఈ నివేదిక వెలువడినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News