Monday, December 23, 2024

అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన దరిమిలా తనపై వస్తున్న ఒత్తిళ్లను పురస్కరించుకుని అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ షీటెల్ తన పదవికి రాజీనామా చేశారు. 2022 ఆగస్టు నుంచి ఆమె ఈ పదవిలో కొనసాగుతున్నారు.

పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై ఒక 20 ఏళ్ల యువకుడు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు బుల్లెట్ గురి తప్పి ఆయన చెవిని రాసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో బరువెక్కిన హృదయంతో తన పదవికి రాజీనామా చేయాలన్న క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నానని తన సిబ్బందికి పంపిన ఈమెయిల్‌లో షీటెల్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News