Thursday, January 23, 2025

హుటాహుటిన ఇజ్రాయెల్‌కు బ్లింకెన్

- Advertisement -
- Advertisement -

టెల్‌అవీవ్ : గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బహుముఖ దాడుల ఉధృతి దశలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఇజ్రాయెల్‌కు వెళ్లారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించి ఇజ్రాయెల్‌కు ఏ విధమైన సాయం అందించాలనేది బ్లింకెన్ చర్చిస్తారు. తమ దేశం ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుందని ఇప్పటికే అమెరికా అధ్యక్షులు బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌లో కొద్ది గంటలే ఉండి తరువాత బ్లింకెన్ అక్కడి నుంచి జోర్డాన్‌కు వెళ్లుతారు. దేశాధినేతలతో చర్చిస్తారని వెల్లడైంది. కాగా హమాస్‌కు మద్దతుగా కొన్ని దేశాలు, ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగితే పరిస్థితి ఏమిటనే అంశంపై ఇప్పుడు అమెరికా ప్రధానంగా దృష్టి సారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News