Monday, December 23, 2024

భారత్‌లో అమెరికా భద్రతా సలహాదారు బృందం

- Advertisement -
- Advertisement -

ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు

వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యంత ప్రధాన మైలురాయిగా పరిగణిస్తున్న ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసిఇటి)తోసహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అత్యంత ప్రధానమైన జాతీయ భద్రతా సలహాదారుడు ఒకరు సీనియర్ భారత అధికారులతో చర్చలు జరిపారు. అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చడానికి కుట్రపన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో ఒక భారతీయ అధికారికి సంబంధాలు ఉన్నట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో బైడెన్‌ను డిప్యుటీ జాతీయ భద్రతా సలహాదారుడైన జోనాథన్ ఫైనర్ భారత్‌ను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఫైనర్ సారథ్యంలో ఒక అమెరికన్ ప్రతినిధి బృందం సోమవారం న్యూఢిల్లీ చేరుకుంది. భారత డిప్యుటీ జాతీయ భద్రతా సలహాదారు విక్రం మిస్రీతో ఐసిఇటిపై అమెరికన్ బృందం సమీక్షించనున్నది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భద్రత, సాంకేతిక సహకారానికి సంబంధించి ఐసిఇటి అమెరికా, భారత్ మధ్య భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వైట్ హౌస్ తెలిపింది. ఐసిఇటిని భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా 2022 మేలో ప్రారంభించారు. భారత్‌లోని జాతీయ భద్రత మండలి సచివాలయం(ఎన్‌ఎస్‌సిఎస్), అమెరికా జాతీయ భద్రతా మండలి(ఎన్‌ఎస్‌సి) సంయుక్త ఆధ్వర్యంలో ఐసిఇటి పనిచేస్తోంది.

హిందూ మహా సముద్ర ప్రాంతంతోసహా ఇండో-పసిఫిక్ అంతటా సమన్వయంతో పనిచేసే లక్షంతో ఫైనర్ నాయకత్వంలోని ప్రతినిధి బృందం రాయబాది మిస్రీతోపాటు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో లోతుగా చర్చలు జరిపినట్లు వైట్ హౌస్ పేర్కొంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులతోపాటు వాణిజ్య నౌకాయానంలో భద్రతాపరమైన రక్షణ, గాజా సమస్యకు పరిష్కారంగా రెండు దేశాల ఏర్పాటు ప్రతిపాదన వంటి అంశాలతోపాటు పశ్చిమాసియా పరిస్థితిపై వీరు చర్చించినట్లు తెలిపింది. అమెరికాలో ఒక వేర్పాటువాద సిక్కు నాయకుడిపై ఒక భారతీయ అధికారి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం అమెరికా విదేశాంగ శాఖ స్వాగతించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News