Thursday, December 26, 2024

యుఎస్ అధీనంలో 5 లక్షల బ్యారెళ్ల ఇరానియన్ ఆయిల్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్న 5 లక్షలకు పైగా బ్యారెళ్ల ఇరానియన్ ఆయిల్‌ను తాము స్వాధీనం చేసుకునట్లు అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. ఇరాన్ పారా మిలిటరీ దళానికి నిధుల కోసం ఆ చమురును అక్రమంగా రవాణా చేస్తున్నారని అమెరికా న్యాయ శాఖ అధికారులు ఆరోపించారు. అంతే కాదు. చైనా, రష్యా, సిరియాలలో కొనుగోలుదారులకు క్రూడాయిల్ విక్రయానికి సంబంధించి క్రిమినల్ అభియోగాలను కూడా ప్రాసిక్యూటర్లు ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య తాము తీసుకున్న ఈ చర్యలు ఇరాన్ పారా మిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌ల కుడ్స్ ఫోర్స్‌కు

నిధులు సమీకరణను అడ్డుకునే యత్నంలో భాగం అని అధికారులు పేర్కొన్నారు. ‘అమెరికాకు ఇరాన్ నుంచి నిరంతరం ముప్పు ఎదురవుతోంది. మా సరిహద్దుల లోపల అమెరికన్ల హత్యకు వారు ప్రయత్నిస్తున్నారు. పిల్లల ఆసుపత్రిపై సైబర్ దాడి నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారు’ అని ఎఫ్‌బిఐ డైరెక్టర్ క్రిస్టఫర్ రే ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘ఇరాన్ నేరాలన్నిటికీ మూల్యం తప్పదు. ఇరాన్ ఖజానాకు డబ్బు అందకుండా చేయడానికి అమెరికా ఆంక్షల అమలుకు ఎఫ్‌బిఐ నిబద్ధమై ఉంది’ అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News