Thursday, December 26, 2024

చైనా నిఘా బెలూన్ వివరాలు భారత్‌కు!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఈ మధ్య కాలంలో అమెరికాలో చైనా బెలూన్‌ను కూల్చేశారు. దానికి సంబంధించిన వివరాలను అమెరికా కొన్ని మిత్రదేశాలతో పంచుకుంది. సోమవారం ‘ఎక్స్‌కోప్ ఇండియా23’ పేరిట భారత వాయుసేన విన్యాసాలు ప్రారంభించింది. ఇందులో భారత్‌, అమెరికా వాయుసేనలు సంయుక్తంగా విన్యాసాలు చేశాయి. ఈ సందర్భంగా భారత్ వాయుసేన చీఫ్ వి.ఆర్.చౌదరి, అమెరికాకు చెందిన పసిఫిక్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ కెన్నిత్ విల్స్‌బాష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెన్నిత్ విలేకరులతో మాట్లాడుతూ చైనా బెలూన్ కూల్చివేత ఆపరేషన్ వివరాలను భారత్ సహా కొన్ని వాయుసేనలతో పంచుకున్నట్లు తెలిపారు.

భారత్‌అమెరికా యుద్ధ విన్యాసాలు పశ్చిమబెంగాల్‌లోని పానాగఢ్, కలాయ్‌కుండా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన రెండు బి1 లాన్సర్ బాంబర్లు తొలిసారిగా ఇందులో పాల్గొన్నాయి. ఇవి ఈనెల 13న భారత భూభాగంలో దిగనున్నాయి. ఇప్పటికే అమెరికా వాయుసేనకు చెందిన ఎఫ్15 ఫైటర్ జెట్‌లు, సి17, సి130 జె విమానాలు భారత్ చేరుకున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే తైవాన్‌చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఈ విన్యాసాలు మొదలు కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News