Saturday, April 12, 2025

అమెరికాలో తొలి హిందూ ఫోబియా బిల్లు

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని జార్జియాలో హిందూయిజానికి సంబంధించిన కీలకమైన హిందూ ఫోబియా బిల్లును ప్రవేశపెట్టారు. హిందూ మతవాదపు హిందూ ఫోబియా, హిందూ వ్యతిరేక భావాల హిందూ బైగట్రినీ ప్రాధమికంగా గుర్తించడం ఈ బిల్లు ప్రధాన ఉద్ధేశం. సంబంధిత బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో తీసుకువచ్చారు. ఇది చట్టం అయితే హిందూ ద్వేషానికి పాల్పడే వారిని శిక్షించేందుకు ఇక్కడి స్థానిక నేరం శిక్షా స్మృతులను తగు విధంగా సవరించడానికి, హిందూ వర్గాలకు రక్షణ కల్పించడానికి వీలేర్పడుతుంది. ఇంతవరకూ అమెరికాలో ఇటువంటి హిందూ ఫోబియా చట్టం లేదు. ఇక్కడ నెగ్గితే ఇది అమెరికాలో సంబంధిత విషయంలో అమలులోకి వచ్చే తొలి చట్టం అవుతుందని పరిశీలకులు తెలిపారు. ఇటీవల ఇక్కడ తీసుకువచ్చిన బిల్లును అటు డెమోక్రాట్లు ఇటు రిపబ్లికన్లు కూడా ప్రతిపాదించారు.సంబంధిత బిల్లు ప్రవేశ పెట్టడం , ఆమోదానికి మద్దతు లభించడం కీలక పరిణామం అని హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా కూటమి వర్గాలు స్పందించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News