Saturday, November 23, 2024

గాజాలో మానవతా సంక్షోభం నివారణకు అమెరికా ముమ్మర యత్నాలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : గాజాలో సంక్షోభం వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్ .. ఇటు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తోపాటు అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరిపారు. గాజాకు మానవతా సాయాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. సామాన్య పౌరులను రక్షించేందుకు కొనసాగే చర్యలకు తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

మరోవైపు అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా యూఎస్‌ఎస్ డ్వైట్ డి. ఐసన్‌హోవర్ అనే క్యారియర్ స్టైక్ గ్రూప్‌ను పంపింది. ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్ కు సపోర్ట్‌గా యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ క్యారియర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ సంక్షోభ నివారణకు పశ్చిమాసియా దేశాలతో దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ యుద్ధం మరింత విస్తరించకుండా నిలువరించేందుకు వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నారు.

సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తోపాటు యుఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ చర్చించారు. ఈ పోరులో చిక్కుకున్న సామాన్యుల పౌరులను మానవతా సంక్షోభం నుంచి రక్షించేందుకు కావాల్సిన చర్యలను చేపడుతున్నారు. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్… ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌తో మాట్లాడారు. సామాన్యులను రక్షించాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు.

ప్రమాదంలో ఉన్న పౌరుల సంఖ్య, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే ప్రమాదంపై అంతర్జాతీయంగా ఆందోళన కొనసాగుతోంది. అమెరికా విస్తృత సంప్రదింపులు దాన్నె ప్రతిబింబిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తరువాత బైడెన్ ఇప్పటికే పలుసార్లు నెతన్యాహుతో మాట్లాడారు. కానీ పాలస్తీనా అధ్యక్షుడితో చర్చించడం మాత్రం ఇదే తొలిసారి. గాజా లోని పాలస్తీనా ప్రజలకు సాయం అందించేందుకు చేపడుతున్న చర్యలను బైడెన్‌కు అబ్బాస్ ఈ సందర్భంగా వివరించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News