Monday, December 23, 2024

యెమెన్‌లో హౌతీల స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీ ఆగ్రవాదుల అధీనంలో ఉన్న క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం బుధవారం నౌకలు, జలాంతర్గాముల నుంచి క్షిపణులతో దాడి జరిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులే లక్షంగా అమెరికా సైన్యం క్షిపణి దాడులు జరపడం ఇది గత కొద్ది రోజుల్లో నాలుగవసారి. ఎర్ర సముద్రం నుంచి అమెరికా సైన్యం హౌతీ ఉగ్రవాదులకు చెందిన 14 క్షిపణులను లక్షంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. హౌతీలను ప్రత్యేక ప్రపంచ ఉగ్రవాదులుగా అమెరికా ప్రభుత్వం బుధవారం ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.

యెమెన్‌లోని హౌతీల అధీనంలోని ప్రాంతాలలో పేల్చడానికి సిద్ధంగా ఉన్న 14 క్షిపణులపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ ఆర్థిక సహాయంతో హౌతీలు క్షిపణి దాడులకు తెగపడుతున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు, నౌకాదళానికి చెందిన నౌకలనే లక్షంగా చేసుకుని హౌతీ ఉగ్రవాదులు క్షిపణి దాడులకు పాల్పడే ముప్పు ఉందని సెంట్రల్ కమాండ్ తెలిపింది. స్వీయరక్షణ కోసం క్షిపణి దాడులు చేసే హక్కు అమెరికాకు ఉందని సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News