న్యూయార్క్: తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ముంబై ఉగ్రదాడిలో దోషిగా తేలిన తహవూర్ రాణా(64) పెట్టుకున్న అత్యవసర స్టే పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం అతడు లాస్ ఏంజెల్స్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. అతడు అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్, తొమ్మిదవ సర్కూట్ జస్టిస్ వద్ద ‘స్టే కోసం అత్యవసర దరఖాస్తు’ పెట్టుకున్నాడు. ‘దరఖాస్తును జస్టిస్ కాగన్ తిరస్కరించారు’ అని అమెరికా సుప్రీంకోర్టు 2025 మార్చి 6న తన వెబ్‌సైట్ నోట్‌లో పేర్కొంది. రాణా తన దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ ఎలెనా కగన్‌కు సమర్పించుకున్నాడు. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని తన పిటిషన్‌లో అతడు వేడుకున్నాడు. తహవూర్ రాణా పాకిస్థాన్ మూలాలున్న కెనడా జాతీయుడు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి. ముంబై దాడుల కుట్రకు మాస్టర్‌మైండ్ అని భావిస్తున్న డేవిడ్ కోల్యన్ హెడ్లీతో రాణాకు పరిచయం ఉంది.
తహవూర్ రాణా స్టే పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీం కోర్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -