- Advertisement -
నేడు ఐరాస భద్రతా మండలిలో చర్చ
వాషింగ్టన్: మయన్మార్‌లో సైన్యం దాడులకు నిరసనగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా తెలిపింది. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని పునరుద్ధరించే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ తాయ్ తెలిపార. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతన్న బర్మా ప్రజలకు తమ మద్దతు ఉంటుందని తాయ్ తెలిపారు. బుధవారం జరిగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మయన్మార్‌లో సైన్యం జరుపుతున్న హింసాత్మక దాడులపై చర్చించాలని బ్రిటన్ పిలుపునిచ్చింది. అయితే, మిలిటరీ ప్రభుత్వానికి చైనా బాసటగా ఉన్నదన్న వార్తల నేపథ్యంలో భద్రతా మండలి నుంచి కఠిన నిర్ణయాలను ఆశించలేని పరిస్థితి.
- Advertisement -