లాస్ ఏంజిలెస్: అర్థశతాబ్దం పాటు తన టాక్‌షోలతో ప్రసారమాధ్యమాన్ని ఏలిన ల్యారీ కింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 87. తనకంటూ ప్రత్యేక వస్త్రధారణతో అందరిని ఆకట్టుకునే విధంగా ఆయన చేసిన టీవీ, అంతకుముందటి రేడియో ఇంటర్వూలు, టాక్‌షోలు విశేష ప్రచారం పొందాయి. ప్రఖ్యాత ప్రపంచస్థాయి నేతలు, సినిమా స్టార్లు, క్రీడాకారులు మొదలుకుని సగటు మనిషి వరకూ ఎందరితోనే ముచ్చటించి, అమెరికా వ్యాఖ్యాన కళకు వన్నె తెచ్చారు. శనివారం ల్యారీ కింగ్ స్థానిక సెడర్స్ సినాయి మెడికల్ సెంటర్‌లో మృతి చెందినట్లు ఒరా మీడియా తెలిపింది.
దీనిని ఆయన ఇతరులతో కలిసి ఏర్పాటు చేశారు. అయితే ఆయన మృతికి కారణాలు వెల్లడించలేదు. కానీ సిఎన్‌ఎన్ ఇంతకు ముందు వెలువరించిన వార్తలలో ఆయన కొవిడ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కింగ్ పూర్తి పేరు లారెన్స్ హర్వే జిగెర్. బ్రూక్లిన్‌లో 1933లో జన్మించారు. సిఎన్‌ఎన్‌తో ఆయనకు చిరకాల బంధం ఉంది. 1985 నుంచి 2010 వరకూ రాత్రిపూట పలు షోలు నిర్వహించారు. ఈ దశలో ఆయనకు పలు పురస్కారాలు పొందారు. అమెరికాలో దాదాపుగా అందరు దేశాధ్యక్షులను ఇంటర్వూలు నిర్వహించిన ప్రముఖుడీయన, రష్యాకు చెందిన ఓ ఆంగ్ల టీవీ ఛానల్‌లో రాజకీయ అంశాలతో ఓ ప్రత్యేక ధారావాహికమే నిర్వహించారు.
us talk show host larry king passed away