హైదరాబాద్: విదేశాలలో చదవడానికి తమ అభిలాషలతో క్రిమ్సన్ ఎడ్యుకేషన్ ను విశ్వసించిన విద్యార్థులు తమ పూర్తి ఉన్నత పాఠశాల అనుభవాన్ని ఉత్తమంగా వినియోగించగలరని ప్రపంచంలో ప్రముఖ కాలేజ్ అడ్మిషన్ కన్సల్టెంట్స్ లో ఒకటైన క్రిమ్సన్ ఎడ్యుకేషన్, ఈ రోజు ప్రకటించింది. గ్రేడ్ 9లో తమ ప్రొఫైల్ ప్రయాణాన్ని రూపొందించడాన్ని ఆరంభించే విద్యార్థులు, సాధారణ దరఖాస్తుదారునితో పోల్చినప్పుడు తమ సొంత స్కూల్ లో ఏడు రెట్లు ఎక్కువగా ఆమోదించబడే అవకాశాలు పొందుతారు. ఇది గ్రేడ్ 9 నుండి 12 వరకు తమ ఉన్నత పాఠశాల మైలురాళ్ల కోసం వ్యూహాత్మకమైన ప్రణాళికను తయారు చేసిన ప్రత్యక్షమైన ఫలితం.
చదువు మాత్రమే కాకుండా, ఎక్స్ ట్రా కర్రిక్యులర్ కార్యకలాపాలు గొప్ప ప్రొఫైల్, అసాధారణమైన ప్రొఫైల్ మధ్య తేడా చూపించే అంశంగా ఉంటుంది. ఈ విజయవంతులైన విద్యార్థులు, సగటున, ప్రతి వారం 53.3 గంటలు సామాజిక-సాంస్కృతిక ఎక్స్ ట్రాకర్రిక్యులర్, నాయకత్వ కార్యకలాపాలు (ఈసీఎల్) అనుసరించడానికి వెచ్చించారు. దీనిని తమ క్రమబద్ధమైన సంస్థ పాఠ్యాంశానికి అదనంగా చేసారు. ఈ సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలలో కమ్యూనిటీ సేవలు, సామాజిక కారణాలు కోసం వలంటరీంగ్ చేయడం, వ్యక్తిగత ప్రాజెక్ట్స్, నిధుల సమీకరణ, విరాళం, నాయకత్వ పాత్రలను ప్రోత్సహించే చర్య, వివిధ సంస్థలైన క్లబ్స్, మండళ్లు లేదా వేదికలలో సహకారం కలిగి ఉంటాయి.
పరిశోధన, ఇంటర్న్ షిప్స్, చదువుకు విద్యార్థులు ప్రతి వారం సగటున 33 గంటలు కేటాయించడంతో అకాడమిక్ ఈసీల్ రెండవ స్థానంలోకి వచ్చింది. ఐవీ లీగ్ కళాశాలలకు ఎంపిక చేయబడిన విద్యార్థులు కూడా ప్రతి వారం తమ క్రీడలకు సగటున 19 గంటలు కేటాయించారు. స్టాన్‌ఫోర్డ్, ఎంఐటీ, కాల్టెక్, డ్యూక్, చికాగో, జాన్స్ హాప్‌కిన్స్, నార్త్ వెస్టర్న్, ఐవీ లీగ్‌లతో సహా యూఎస్ఏలో ప్రముఖ 10 యూనివర్శిటీలలో అడ్మిషన్‌లు పొందేందుకు క్రిమ్సన్ ఎడ్యుకేషన్ ఇంతకు ముందు అడ్మిషన్ సైకిల్‌లో 300 మంది విద్యార్థులకు విజయవంతంగా మద్దతు ఇచ్చింది. ఈసీఎల్ డేటా ఈ విద్యార్థుల రికార్డుల నుండి తీసుకోబడింది. క్రిమ్సన్ ఎడ్యుకేషన్స్ విద్యార్థుల బృందంలో దాదాపు 20-25% మంది హైదరాబాద్ విద్యార్థులు ఉన్నారు.
దీని గురించి క్రిమ్సన్ ఎడ్యుకేషన్ కంట్రీ హెడ్ కునాల్ మెహ్రా..“ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్తలలో గౌరవనీయమైన సీట్ల కోసం పోటీపడే విద్యార్థులు ఇతర అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల నుండి తమను తాము భిన్నంగా ఉంచుకోవాలి. ఇక్కడే భారతదేశానికి చెందిన విద్యార్థులు భిన్నంగా నిలిచారు. వారు ముందుగానే ప్రారంభించారు, వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. పాఠ్యేతర కార్యకలాపాల పై దృష్టి సారించడం ద్వారా తమ ప్రత్యేక గుర్తింపులు, సామర్థ్యాలను ప్రదర్శించారు. అయితే ఒక ప్రముఖ సంస్థ ద్వారా విలువైనదిగా పరిగణించబడే సరైన పాఠ్యేతర కార్యాచరణను ఎంచుకోవడం సవాలుగా ఉంటుంది. ఈ సంస్థలు ప్రీ-కాలేజ్ కోర్సులు, సంబంధిత ఇంటర్న్‌షిప్‌లు, కమ్యూనిటీ సర్వీస్, సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తీకరణ కళలు, క్రీడలు సహా మరిన్నింటి శ్రేణిని పరిశీలిస్తాయి. ఈ పరిస్థితిని సరిగ్గా అనుసరించడం తమకు నచ్చిన ప్రముఖ సంస్థలో ప్రవేశానికి దారి తీస్తుంది.”
క్రిమ్సన్ ఎడ్యుకేషన్ విద్యార్థులు తమ నవలలు రాయడానికి తమ క్లబ్స్ ను ప్రారంభించడం ద్వారా ఫైనాన్స్, ఔత్సాహికతతో సంబంధమున్న కార్యకలాపాలు పై ప్రతి వారం 14.8 గంటలు వెచ్చించారు. ఐవీ లీగ్ లో ఎంపిక చేయబడిన విద్యార్థులు కూడా టెక్, అప్లికేషన్స్ అభివృద్ధి చేయడం, సాఫ్ట్ వేర్, వెబ్ సైట్స్ కు సంబంధించిన ఎక్స్ ట్రాకర్రిక్యులర్, నాయకత్వ కార్యకలాపాలు పై ప్రతి వారం 9.1 గంటలు వెచ్చించారు. తమ కళాత్మక సామర్థ్యాలకు చేర్చడానికి నాటకం, సాహిత్యం, సంగీతం వంటి కార్యకలాపాలను అనుసరించడానికి ప్రతి వారం ప్రతి విద్యార్థి 8 గంటలు వెచ్చించారు.
పెరుగుతున్న పోటీ దృష్ట్యా ఎక్స్ ట్రా కర్రిక్యులర్, నాయకత్వ అన్వేషణలకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ ప్రయత్నాలు విద్యార్థులు తమ నైపుణ్యాలు, ప్రతిభల పై దృష్టి కేంద్రీకరించడానికి వారికి సామర్థ్యాన్ని కలిగిస్తాయి, తమ కోసం ఒక విలక్షణమైన గుర్తింపును అలవరుస్తాయి. అలాంటి కార్యకలాపాల్లో నిమగ్నమవడం విద్యార్థులు తమ విద్యాపరమైన సిలబస్ యొక్క తీవ్రతలు నుండి స్వేచ్ఛను కలిగించడంలో అనుమతించడమే కాకుండా తమ రోజూవారీ దినచర్యలో అంతర్గత భాగంగా అభిరుచితో తమ ఆసక్తులను కొనసాగించడానికి ఒక వేదికను కూడా కేటాయిస్తుంది.
క్రిమ్సన్ ఎడ్యుకేషన్ యూఎస్ కాలేజీ అడ్మిషన్ వ్యూహాలు పై సమాచార అవగాహనా సదస్సులను నిర్వహిస్తోంది. పాఠ్యేతర, లీడర్‌షిప్ యాక్టివిటీస్ (ECLలు) యొక్క ప్రాముఖ్యత, వివరాలను కూడా ప్రధానాంశం చేస్తుంది. ఈ ఆకర్షణీయమైన అవగాహనా సదస్సు 2023 అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ జరగాల్సి ఉంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ క్రింద జతచేయబడింది.