Tuesday, January 21, 2025

ట్రంప్ గెలిచాక తొలిసారి.. హూతీలపై విరుచుకుపడ్డ అమెరికా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : యెమెన్ లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. శనివారం సాయంత్రం చేపట్టిన దాడుల్లో మూడు చోట్ల ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్టు పెంటగాన్ తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలను లక్షంగా చేసుకునేందుకు సిద్ధం చేసిన అత్యాధునిక ఆయుధాలను తాము పేల్చేశామని పేర్కొంది.

అమెరికా ఎన్నికల్లో తాజాగా విజయం సాధించిన ట్రంప్ ఇరాన్ విషయంలో అత్యంత కఠినంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైన వేళ తొలిసారి అమెరికా ఫైటర్ జెట్లు దాడులు చేశాయి. అక్టోబర్ మధ్యలో కూడా అమెరికాకు చెందిన అత్యాధునిక బీ2 బాంబర్లు భారీ బంకర్ బస్టర్ బాంబులతో ఆయుధ డిపోలను పేల్చివేశాయి. ఇటీవల అమెరికా దీర్ఘశ్రేణి స్ట్రాటజిక్ బాంబర్లు , ఫైటర్ జెట్లు, ఇతర ఆయుధ సామగ్రిని గల్ఫ్‌కు తరలించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News