Sunday, February 23, 2025

తైవాన్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు

- Advertisement -
- Advertisement -

US warships in Taiwan Strait

తైపీ : అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధిలో ప్రయాణించాయి. చైనా తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల దశలో తొలిసారిగా అమెరికా యుద్ధ నౌకలు ఇక్కడికి చేరుకున్నాయి. అమెరికాకు చెందిన యుఎస్‌ఎస్ అంటియిటం, యుఎస్‌ఎస్ చాన్సెలర్స్‌విలే ఇక్కడ సాధారణ స్థాయిలోనే సంచరిస్తున్నాయని ప్రత్యేకత ఏదీ లేదని అమెరికాకు చెందిన సెవెన్త్ ఫ్లీట్ తెలిపింది. ఎటువంటి అతిక్రమణలు లేకుండా తమ యుద్ధ నౌకలు నిర్ణీత కారిడార్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే ఈ నౌకల కదలికలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా అధికారికంగా తెలిపింది. తాము అప్రమత్తంగా ఉన్నామని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News