Thursday, January 23, 2025

నేనే చెట్టుకు గొలుసుతో కట్టేసుకున్నా:యుఎస్ మహిళ

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని ఒక అడవిలో ఒక చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టివేసి కనిపించిన 50 ఏళ్ల అమెరికన్ మహిళ తానే సంకెలు వేసుకున్నానని, దీనితో వేరే ఎవరికీ సంబంధం లేదని పోలీసులతో చెప్పినట్లు అధికారి ఒకరు సోమవారం తెలియజేశారు. ఆ మహిళ మానసిక ఆరోగ్య పరిస్థితులే ఆమె స్వీయ నిర్బంధానికి కారణమని అధికారి పేర్కొన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆ మహిళ అడవిలో చెట్టుకు సంకెలతో నిర్బంధంలో ఉండి వేస్తున్న కేకలు విన్న ఒక పశువుల కాపరి స్థానిక పోలీసులను అప్రమత్తంచేసినప్పుడు ఆమెకు సంకెల నుంచి విముక్తి లభించింది.

ఆ సంఘటన పెద్ద అలజడి రేపింది. మీడియా దృష్టినీ ఆకర్షించింది. పోలీసులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. సింధుదుర్గ్ పోలీసులు శనివారం (3న) ఆమె వాఙ్మూలాన్ని నమోదు చేశారు. తాను మూడు తాళాలు, ఇనుప గొలుసులు కొన్నానని, ఒక తాళాన్ని, ఒక గొలుసును సోనుర్లి గ్రామం సమీపాన ఒక అడవిలో ఒక చెట్టుకు తనను తాను కట్టివేసుకోవడానికి వాడానని ఆమె చెప్పినట్లు అధికారి తెలియజేశారు. అయితే, ఆమె ఎన్ని రోజులుగా అలా చెట్టుకు కట్టివేసుకుని ఉన్నదో ఇంకా తెలియదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News