- Advertisement -
దుబాయ్: యెమెన్‌లో హూతీలపై అమెరికా వైమానికి దాడులు చేసింది. రాస్ ఐసా చమురు పోర్టుపై అమెరికా వైమానిక దాడులు చేయడంతో 20 మంది హూతీ తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఈ దాడుల్లో మరో 50 మంది గాయపడ్డారు. అమెరికా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య గత కొంత కాలంగా కాల్పులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం మారిబ్ పై అమెరికా వైమానిక దాడులు జరపడంతో 123 మంది మృతి చెందగా 247 మంది గాయపడిన విషయం తెలిసిందే.
- Advertisement -