Tuesday, November 5, 2024

నిజామాబాద్ ఐటి హబ్‌లో యూఎస్‌ఏ కంపెనీ

- Advertisement -
- Advertisement -

క్రిటికల్ రివర్ సంస్థ ఏర్పాటుకు సుముఖత
గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల

మనతెలంగాణ/హైదరాబాద్:  నిజామాబాద్ ఐటి హబ్‌లో యూఎస్‌ఏ కంపెనీ క్రిటికల్ రివర్ సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిందని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. మంత్రితో పాటు నిజామాబాద్ ఐటీ హబ్‌ను ప్రమోట్ చేసే పనిలో భాగంగా క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులను మహేష్ బిగాల కలిశారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ఇప్పటికే క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్‌లో పర్యటించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్‌తో క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు ఫౌండర్ అంజి మారం భేటీ అయ్యారని, ఈ భేటీలో వారు రాబోయే రోజుల్లో నిజామాబాద్ ఐటి హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని మహేశ్ బిగాల చెప్పారు. నిజామాబాద్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, అందుకు రాబోయే రోజుల్లో వారి సంస్థ అక్కడ ఒక బ్రాంచ్ పెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు.

అలాగే ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్, విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ ఐటి హబ్‌లో ప్రస్తుతం ఐటీ దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు మొదలు పెట్టా యన్నారు. మంత్రి కెటిఆర్‌తో జరిగిన భేటీలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్నారై, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, క్రిటికల్ కేర్ ఫౌండర్ అంజి మారం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News