Friday, November 22, 2024

యుద్ధం ఆపాలని పుతిన్‌కు కాస్త చెప్పండి

- Advertisement -
- Advertisement -

మిల్వాకీ: రష్యాతో భారత్‌కు సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉందని యుఎస్ పేర్కొంటూ, మాస్కోతో ఆ సంబంధాన్ని ‘ఉపయోగించుకుని’ ఉక్రెయిన్‌పై ‘అక్రమ యుద్ధాన్ని’ ఆపాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేయవలసిందిగా తాను న్యూఢిల్లీని ప్రోత్సహించినట్లు వెల్లడించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం తన దైనందిన విలేకరుల గోష్ఠిలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘భారత్‌కు చాలా కాలంగా రష్యాతో సంబంధాలు ఉన్నాయి. అది అందరికీ తెలుసని అనుకుంటున్నా. అధ్యక్షుడు పుతిన్‌ను తన అక్రమ యుద్ధాన్ని ముగించాలని, ఈ వివాదానికి చిరకాల శాంతి కనుగొనాలని ఆ సంబంధాలను ఉపయోగించుకుని విజ్ఞప్తి చేయవలసిందని, యుఎన్ చార్టర్‌ను గౌరవించాలని, ఉక్రెయిన్ భూభాగ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని మన్నించాలని పుతిన్‌కు చెప్పవలసిందని భారత్‌ను మేము ప్రోత్సహించాం’ అని మిల్లర్ తెలిపారు. ‘రష్యా తో వారి సంబంధాలకు సంబంధించినంత వరకు మాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అయిన భారత ప్రభుత్వానికి మేం ఆ విషయమైన చ్చజెబుతూనే ఉంటాం’ అని మిల్లర్ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. మోడీ ఈ నెల 9న రష్యా నుంచి తిరు గుప్రయాణమైన వెంటనే మిల్లర్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.

గ్లోబల్ సూపర్ పవర్‌గా భారత్: కిషన్‌రెడ్డి
అమెరికా నుంచి వచ్చిన విజ్ఞప్తి భారత్‌కు పెరిగిన పరపతిని తెలియజేస్తుందని, తద్వారా ఇండియా త్వరలోనే గ్లోబల్ సూపర్ పవర్‌గా అవతరించనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి స్వస్థి పలికేందుకు ఇండియా చొరవ తీసుకోవాలని అమెరికా చేసిన అభ్యర్ధనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు కీలక వ్యాఖ్య లు చేశారు. ఈ రిక్వెస్ట్‌కు సంబందించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికా నుంచి వచ్చిన ఈ విజ్ఞప్తి భారత్-రష్యాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని, అంతర్జాతీయంగా భారత్‌కు పెరిగిన పరపతిని తెలియజేస్తుందన్నారు. పదేళ్లలో మోడీ నాయకత్వంలో భారత్ రాజకీయంగా, ఆర్థికంగా, మౌలిక సదుపాయా ల కల్పనతో పాటు అన్ని రంగాలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News